టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో సూపర్ స్టార్ మహేహ్ బాబు అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కూడా ఒకరు. భారీ ఓపెనింగ్స్ తో వీరి సినిమాలు వెండితెరపై ఆదరగొడతాయి. కానీ వీరిద్దరి కలయికలో వెండితెరపై కాకున్నా ముందే బుల్లితెరపై మాత్రం అదిరే బ్లాస్ట్ సంసిద్ధంగా ఉంది.
తారక్ ప్రస్తుతం చేస్తున్న జెమినీ టీవీ రియాలిటీ షో ఎవరు మీలో కోటీశ్వరులు కి మహేష్ తో ఓ గ్రాండ్ ఎపిసోడ్ ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానిపైనే చాలా ఆసక్తి నెలకొంది. అంతే కాకుండా ఈ దసరా స్పెషల్ గా బహుశా ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుందని కూడా బజ్ ఉంది. ఫైనల్ గా మాత్రం ఈ ఎపిసోడ్ తో భారీ టీఆర్పీ నమోదు అవ్వడం అయితే ఖాయం అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్లే అవుతుందో చూడాలి.