Radhe Shyam : టాలీవుడ్ నుంచి యంగ్ రెబల్ స్టార్ గా స్టార్ట్ అయ్యి పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగిన యంగ్ జెనరేషన్ హీరో ప్రభాస్. తనకి పాన్ ఇండియా లెవెల్లో బాహుబలి తర్వాత అపారమైన పేరు వచ్చాక తర్వాత మరిన్ని ఆసక్తికరమైన సినిమాలు చేస్తూ వచ్చాడు.
అయితే బ్యాడ్ లక్ ఎమిటంటే దాని తర్వాత చేసిన రెండు సినిమాలు ప్లాప్ గానే నిలిచాయి.
అయితే వాటిలో లేటెస్ట్ గా చేసిన “రాధే శ్యామ్” పరిస్థితి మరీ దారుణం. ఎన్నో అంచనాలు పెట్టుకొని రిలీజ్ చేస్తే అనూహ్యంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర చతికిల పడింది.
సరే ఇదంతా బాగానే ఉంది కానీ అప్పుడు ఈ సినిమాపై అంటే థియేటర్స్ లో విపరీతమైన నెగిటివ్ టాక్ రాగా ఇప్పుడు మాత్రం ఓటీటీ లో వచ్చాక అనూహ్యంగా కేవలం పాజిటివ్ టాక్ మాత్రమే వినిపిస్తోంది.
అంటే అప్పుడు థియేట్రికల్ రిలీజ్ కి వదిలేసి ఇప్పుడు ఓటీటీ లో వచ్చాక చూసేసి దాన్ని అందరూ ఒక అపురూపమైన సినిమాగా చెబుతున్నారు. ఓ రకంగా థియేటర్స్ లో వచ్చిన దానికంటే ఇప్పుడే చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఈ సినిమాకి వస్తుంది. అంటే అంతమంది అప్పుడు చూడ్డం మానేసి ఇప్పుడు మాత్రమే చూస్తున్నారు అనుకోవాలి.
ఏది ఏమైనప్పటికీ మాత్రం ఇప్పుడు చూస్తున్న వారు అంతా అప్పుడు చూసి ఉంటే ఇంకా బాగుండేది అని ఇతర ప్రభాస్ అభిమానుల ఆవేదన. ఇంకా ఈ సినిమాలో ప్రభాస్ పక్కన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా యంగ్ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించాడు.
అలాగే యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాని 300 కోట్ల వ్యయంతో తెరకెక్కించారు.