Rajamouli: రాజమౌళి కాళ్ళకు మొక్కిన అలియాభట్… ఫోటో వైరల్!

Rajamouli: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్,శ్రేయ వంటి వారు ప్రధాన పాత్రలలో నటిస్తూ ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టారు.తాజాగా ముంబైలో జరిగిన ఈ సినిమా ట్రైలర్ వేడుకల్లో భాగంగా ఆ చిత్ర బృందం పాల్గొన్నారు. అనంతరం ఈ వేదికపై రాజమౌళి పక్కన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ కూర్చున్నారు.

ఈ క్రమంలోనే అలియా భట్ తన పక్కన కూర్చొని కాలిపై కాలు వేసుకుంటున్న సమయంలో పొరపాటున అలియాభట్ కాలు రాజమౌళికి తగిలింది. దీంతో వెంటనే అలియాభట్ రాజమౌళి కాళ్లకు నమస్కారం చేయ బోయింది. దీంతో అలియా తన కాళ్లు మొక్కడానికి రావడంతో రాజమౌళి వద్దని తనకి చెప్పారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన పలువురు నెటిజన్లు అలియా భట్ వ్యక్తిత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

అలియా భట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇలాంటి వేడుకలు పొరపాటున కాళ్లు చేతులు తగలడం సర్వసాధారణం. కానీ ఈమె తన స్టార్ డమ్ పక్కనపెట్టి దర్శకుడికి కాళ్లు తగిలిందన్న కారణంతో ఏకంగా తన కాళ్లకు నమస్కారం చేయడానికి రావడంతో ఆమె వ్యక్తిత్వం ఏమిటో అర్థమవుతుంది.ఈ క్రమంలోనే అలియా బట్ వ్యక్తిత్వం గురించి సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు.