ఆ మాయరోగం ఆలియాను కూడ వదల్లేదు

Alia Bhatt tested positive for Covid 19

Alia Bhatt tested positive for Covid 19

బాలీవుడ్లో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు స్టార్ హీరో హీరోయిన్లు, దర్శకులు వైరస్ బారిన పడగా ఇప్పుడు స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కూడ కరోనా బారిన పడింది. కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చినట్టు ఆలియా చెప్పుకొచ్చింది. కోవిడ్ అని తెలియగానే ఆలియా హోమ్ క్వారంటైన్లోకి వెళ్ళిపోయింది. మార్చి నెలలో ఆమె వర్క్ చేస్తున్న ‘గంగూభాయ్ కథైవాడి’ సినిమా సెట్లో కరోనా కలకలం రేపింది. ఆ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి వైరస్ కు గురయ్యారు. ఆలియా బాయ్ ఫ్రెండ్ రన్బీర్ కపూర్ సైతం కరోనాకు గురయ్యాడు.

అప్పుడే ఆలియా కూడ పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. దాంతో ఆమె ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణలో కూడ పాల్గొన్నారు. కానీ ఇప్పుడు ఆమెకు పాజిటివ్ అని తేలింది. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ బృందంలో అలజడి మొదలైంది. ఆమెతో షూటింగ్లో పాల్గొన్న వారికి కారోనా కంగారు పట్టుకుంది. ముంబైలో నిన్న ఒక్కరోజే 8000లకు పైగా పాజిటివ్ కేసులు వచ్చాయి. దేశం మొత్తం కేసులు మెల్లగా తగ్గుతుంటే ముంబైలో మాత్రం పెరుగుతున్నాయి. ఇదే బాలీవుడ్ ఇండస్ట్రీ ఇంకా కోలుకోలేకపోవడానికి ప్రధాన కారణం. ఆడియన్స్ థియేటర్లకు రావడానికి జంకుతున్నారు. ఫలితంగా సినిమాలు అరకొర వసూళ్లతో బాక్సాఫీస్ ముందు బోల్తాపడుతున్నాయి.