Alia Bhat:బాలీవుడ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సి క్వీన్ గా కొనసాగుతూ నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే కంగనారనౌత్ గత కొన్ని రోజుల నుంచి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ల పై తీవ్ర విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. సాధారణంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో వారసత్వాన్ని ఇష్టపడని కంగనారనౌత్ స్టార్ కిడ్స్ గురించి నిత్యం ఏదో ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ మహేష్ భట్ అంటే ఏమాత్రం సరిపడని కంగనా ఆయన కూతురు ఆలియా భట్ పై నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే అలియా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం గంగుబాయి కథియావాడి. ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీ విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే ఈ సినిమా పై కంగనా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. కంగన చేసిన ఈ వ్యాఖ్యలు వల్ల వీరిద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
ఫిబ్రవరి 25వ తేదీ శుక్రవారం దాదాపు 200 కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోతుంది అంటూ అలియా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోలేదని పరోక్షంగా కంగనా కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే కంగనా చేసిన ఈ వ్యాఖ్యలపై అలియా స్పందిస్తూ కేవలం ఇలాంటి మాటలు ఎలాంటి పని లేనివారు, పనిలో పసలేని వారు చేసే వ్యాఖ్యలు అంటూ పరోక్షంగా ఆలియా పై షాకింగ్ కామెంట్స్ చేశారు. మరి అలియా చేసిన ఈ వ్యాఖ్యలపై కంగనా ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.