Rahul Sankrityan: శ్యామ్ సింగరాయ్ దర్శకుడితో అక్కినేని హీరో.. నిజమెంత?

Rahul Sankrityan: విజయ్ దేవరకొండ హీరో టాక్సీవాలా చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్. ఈయన మొదటి సినిమాతో పరవాలేదు అనిపించుకున్నప్పటికే తన రెండవ సినిమాతోనే నాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా పూర్వజన్మ ప్రేమ కథ చిత్రం ద్వారా శ్యామ్ సింగరాయ్ అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా భారీ కలెక్షన్లను రాబట్టింది.

ఇక ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదలయి గ్లోబల్ జాబితాలో మూడవ స్థానాన్ని ఆక్రమించుకుంది.ఇలా తన రెండవ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈయనకు వరుస అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాహుల్ తన తదుపరి ప్రాజెక్టును మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేయాలని భావిస్తున్నారు. అయితే రామ్ చరణ్ ఇప్పటికే చాలా సినిమాలను లైన్లో పెట్టడం వల్ల ఆయన కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇచ్చే సూచనలు కనబడక పోవడంతో ఈ డైరెక్టర్ ఒక అద్భుతమైన కథ ద్వారా హీరో నాగచైతన్యను సంప్రదించినట్లు తెలుస్తోంది.

నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఒక సినిమాని తెరకెక్కిస్తే తప్పకుండా విజయం సాధిస్తుందని భావించినట్లు తెలుస్తోంది.అయితే ప్రస్తుతం నాగచైతన్య కూడా పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు పూర్తయిన వెంటనే నాగచైతన్య రాహుల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడని వార్తలు సోషల్ మీడియాలో బలంగా వినపడుతున్నాయి. అయితే ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.