నెటిజన్ అడిగిన ప్రశ్నకు షాక్ అయిన సుశాంత్… సూపర్ రిప్లై ఇచ్చిన అక్కినేని హీరో!

అక్కినేని వారసుడు సుశాంత్ కాళిదాసు సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ సినిమా ద్వార సుశాంత్ కి తగిన గుర్తింపు లభించలేదు. తర్వత సుశాంత్ కరెంట్, అడ్డా, అలా వైకుంఠపురములో వంటి సినిమాలలో నటించాడు. కొంత కాలం సినిమాలకి దూరమైన సుశాంత్ మళ్లీ అలా వైకుంఠ పురములో సినిమా ద్వారా ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చాడు . అల్లు అర్జున్ తో కలిసి అలా వైకుంఠపురములో సినిమాలో నటించినందుకు సుశాంత్ కి మంచి గుర్తింపు లభించింది. ఆ సినిమా మంచి హిట్ అవటంతో “ఇచ్చట వాహనములు నిలుపరాదు” అనే సినిమాలో కూడా నటించాడు. అయితే మిగిలిన అక్కినేని వారసుల లాగా సుశాంత్ స్టార్ హీరో కాలేకపోతున్నారు.

ఇదిలా ఉండగా అందరి సెలబ్రిటీలలాగే సుశాంత్ కూడా సోషియల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. ఈ క్రమంలో అభిమానులతో సరదాగా చిట్ చాట్ చేస్తూ అభిమానులకి దగ్గరౌతున్నారు. ఈ క్రమంలో తాజాగా షూట్ యువర్ క్వశ్చన్స్ అంటూ… నెట్టింట్లో.. అభిమానులతో చిట్ చాట్ చేశాడు. ఈ చిట్ చాట్ లో అభిమానులు అడిగే ప్రశ్నలకు సుశాంత్ సమాధానాలు చెప్పాడు. అయితే ఈ క్రమంలో అనూహ్యంగా ఒక నెటిజన్ అడిగిన ప్రశ్న సుశాంత్ తో పాటు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

సాధారణంగా కొంత మంది నెటిజన్స్ ముందు వెనుక ఆలోచించకుండా నోటికి ఏది అనిపిస్తే అది అడిగేస్తున్నారు. ఈ క్రమంలో ఏ సర్టిఫికెట్ క్యశ్యన్స్ అడుగుతూ వారిని ఇబ్బంది పెడుతున్నారు. తాజాగా సుశాంత్ కి కూడా అలాంటి ప్రశ్న ఎదురయ్యింది. మీరు వర్జినేనా అని ఓ నెటిజన్ సుశాంత్ ని ప్రశ్నించాడు. మొదట ఈ ప్రశ్నకి షాక్ అయిన సుశాంత్ తర్వాత కూల్ గా.. తెలివిగా సమాధానం చెప్పాడు. నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా సుశాంత్ ఒక వెలుగుతున్న దీపం బొమ్మను సమాధానంగా పంపించాడు. ప్రస్తుతం ఈ చిట్ చాట్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.