రష్మికపై కన్నేసిన అక్కినేని సిన్నోడు.!

Akkineni Bachelor Eyes On Rashmika | Telugu Rajyam

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో పూజా హెగ్దే – రష్మిక మండన్న మధ్య బీభత్సమైన పోటీ నడుస్తోంది. ఈ పోటీలో ప్రస్తుతానికైతే పూజా హెగ్దేనే పై చేయి సాధిస్తోంది. ఇక, పూజా హెగ్దేతో ఇటవల ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా చేసిన అక్కినేని సిన్నోడు అఖిల్, తన తదుపరి సినిమా కోసం రష్మిక పేరుని పరిశీలిస్తున్నాడట.

ఈ విజయదశమికి విడుదలైన సినిమాల్లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కాస్త ఎడ్జ్ దక్కించుకుంది. వసూళ్ళు బాగానే వున్నాయి. ఇప్పటిదాకా వచ్చిన అఖిల్ సినిమాలతో పోల్చితే, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఒకింత కమర్షియల్ విజయాన్ని అఖిల్ అక్కినేనికి ఇచ్చిందనే చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం అఖిల్ ఖాతాలో పలు సినిమాలున్నాయి. అందులో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ఒకటి. ఇంతకీ, అఖిల్ – రష్మిక కాంబినేషన్ ఏ సినిమా కోసం.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ కాంబినేషన్ ఆల్మోస్ట్ ఖాయమైపోయినట్లే తెలుస్తోంది.

అన్నట్టు, అక్కినేని నాగార్జున – నాని కలిసి నటించిన ‘దేవదాస్’ సినిమాలో రష్మిక, నానికి జంటగా నటించిన సంగతి తెలిసిందే.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles