Akhil Akkineni: ఇటీవల అక్కినేని కుటుంబంలో శుభకార్యం జరిగిన సంగతి మనకు తెలిసిందే. అక్కినేని నాగచైతన్య శోభితల వివాహం డిసెంబర్ 4వ తేదీ అన్నపూర్ణ స్టూడియోలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇలా అక్కినేని నాగచైతన్య పెళ్లి కంటే ముందుగా నాగార్జున మరొక శుభవార్తను కూడా అభిమానులతో పంచుకున్నారు. తన చిన్న కుమారుడు అఖిల్ నిశ్చితార్థం కూడా జరిగింది అంటూ ఆయన నిశ్చితార్థపు ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే నాగచైతన్య శోభిత పెళ్లి సమయంలోనే అఖిల్ జైనాబ్ వివాహం కూడా జరగబోతుందని అందరూ భావించారు.
ఇలా అఖిల్ పెళ్లి గురించి వస్తున్న వార్తలపై నాగార్జున స్పందిస్తూ వచ్చే ఏడాది వీరి వివాహం జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా అఖిల్ జైనాబ్ పెళ్లికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వీరి వివాహం మార్చి 24వ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుందని వీరి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా జైనాబ్ కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారని వీరు పెళ్లికి ఎంతోమంది వ్యాపారవేత్తలు సినిమా సెలబ్రెటీలు క్రికెటర్లు కూడా హాజరు కాబోతున్నారని సమాచారం.
ఇకపోతే అఖిల్ కి కూడ గతంలో శ్రియ భూపాల్ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరుపుకున్నారు. నిశ్చితార్థం జరిగిన తర్వాత కొన్ని వ్యక్తిగత భేదాభిప్రాయాలు కారణంతో వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. దీంతో శ్రేయ భూపాల్ మరో వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని భర్త పిల్లలతో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు అయితే ఈమెతో బ్రేకప్ అయిన తర్వాత అఖిల్ తిరిగి జైనాబ్ అనే అమ్మాయి ప్రేమలో పడ్డారు. ఇలా కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట ఈ ఏడాదిలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక జైనాబ్ అఖిల్ మధ్య ప్రేమ చిగురించడానికి కారణం రానా భార్య మిహిక అంటూ అప్పట్లో ఒక వార్త వినిపించింది. జైనాబ్ మిహీకా క్లోజ్ ఫ్రెండ్ కావడంతో అఖిల్ కి కూడా పరిచయం ఏర్పడటం ఆ పరిచయం ప్రేమగా మారటం జరిగిందని తెలుస్తుంది.