Akhira: సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈయన సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉన్నారు. ఇక సినిమాలకు దూరమైన ఈయన తన కుమారుడిని ఇండస్ట్రీలోకి తీసుకువస్తారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే ఆఖీరా ఎంట్రీ గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా మరో వార్త కూడా వైరల్ అవుతుంది. ఇక ఆఖీరాను ఇండస్ట్రీకి లాంచ్ చేసే అవకాశాన్ని ఏ దర్శకుడు అందుకుంటారు అంటూ ఇన్ని రోజులు సందేహాలు వ్యక్తమయ్యాయి కానీ ఆకిరాను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను త్రివిక్రమ్ శ్రీనివాస్ తన కుమారుడు రిషి మనోజ్ కి అప్పగించారని తెలుస్తుంది.
దర్శకుడుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కుమారుడిని త్రివిక్రమ్ శ్రీనివాస్ కుమారుడు రిషి ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే వీరిద్దరి ప్రాజెక్టు పట్టాలెక్కడానికి మరో రెండు సంవత్సరాల పాటు సమయం పడుతుందని తెలుస్తుంది.
ప్రస్తుతం త్రివిక్రమ్ కొడుకు రిషి తన తండ్రి వద్ద కొన్ని దర్శకత్వంలో మెలకువలు నేర్చుకున్నారని తెలుస్తుంది. అదేవిధంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ వద్ద కూడా శిక్షణ కోసం త్రివిక్రమ్ తన కొడుకును పంపించినట్ల సమాచారం. ప్రస్తుతం సందీప్ రెడ్డి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న స్పిరిట్ సినిమాకు రిషి అసోసియేట్ డైరెక్టర్ గా కూడా పనిచేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఆఖీరా రిషి కాంబోలో రాబోయే సినిమా కూడా వైల్డ్ బ్యాక్ డ్రాప్ మూవీగా రాబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని వివరాలు అధికారకంగా వెలువడాల్సి ఉంది.