Akhira: అకీరా ఎప్పుడు హీరోగా వచ్చిన హీరోయిన్ మాత్రం ఆమె ఉండాలి… డిమాండ్స్ మామూలుగా లేదే?

Akhira: సినిమా ఇండస్ట్రీలోకి వారసులు రావడం అనేది సర్వసాధారణంగా జరిగే అంశం. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది మెగా వారసులుగా వచ్చి హీరోలుగా కొనసాగుతున్నారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా ఎంట్రీ కోసం అభిమానులు అందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా అకీరా సినీ ఎంట్రీ గురించి ఎన్నో రకాల వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

అకీరాను హీరోగా ఇండస్ట్రీకి వైజయంతి మూవీస్ బ్యానర్ వారు పరిచయం చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ నిర్మాణ సంస్థలో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, లేదా పంజా సినిమా డైరెక్టర్ విష్ణువర్ధన్ దర్శకత్వంలోనే ఈయన ఇండస్ట్రీకి పరిచయం కాబోయే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అఖీరాను దాదాపు ప్రశాంత్ నీల్ ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని తెలియడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అకీరా రెండేళ్ల తరువాతనే ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి అయితే అభిమానులు మాత్రం అకీరా సినీ ఎంట్రీ గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో తన సినిమాలో హీరోయిన్గా ఎవరైతే బాగుంటారు అంటూ చర్చలు కూడా జరుపుతున్నారు ఈ క్రమంలోనే పవన్ అభిమానులు అకీరా సినిమాలో హీరోయిన్ విషయంలో పెద్ద ఎత్తున డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి.

అకీరా ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన సినిమాలో మాత్రం హీరోయిన్గా మహేష్ బాబు కుమార్తె సితార మాత్రమే ఉండాలి అంటూ అభిమానులు డిమాండ్లు చేస్తున్నారు. వీరిద్దరి జోడి బాగుంటుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే మహేష్ బాబు పవన్ కళ్యాణ్ మధ్య కూడా చాలా మంచి అనుబంధం ఉన్న నేపథ్యంలో పవన్ అభిమానులు ఇలాంటి డిమాండ్లు చేస్తున్నారు. మరి పవన్ అభిమానుల డిమాండ్స్ మేరకు ఏ డైరెక్టర్ అయిన వీరిద్దరి కాంబోని సెట్ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.