అభిజిత్ ఫ్యాన్ అని చెప్పి అఖిల్ పరువు తీసేసిన అతని అన్నయ్య

Akhil was shocked when his brother said that he is fan of abhijith
akhil brother bablu
akhil brother bablu

బిగ్ బాస్ లో శనివారం నాటి ఎపిసోడ్‌లో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. బిగ్ బాస్ ఇంటి సభ్యుల్ని కలవడానికి వాళ్ల కుటుంబ సభ్యుల వచ్చారు. వాళ్లతో మాట్లాడిన నాగార్జున టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరో చెప్పాలని కోరారు. ఒక బోర్డ్ ఇచ్చి హౌస్‌లో ఉన్న ఎనిమిది మందిలో టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ఎవరో చెప్పాలని కోరారు.అయితే అఖిల్ అన్న బబ్లూ మొదటిగా సొహైల్ ఫొటో పెట్టి అఖిల్‌కి షాక్ ఇచ్చాడు.. నా ఫొటో పెట్టకుండా వేరే వాళ్ల ఫొటో పెడుతున్నావ్.. నా పరువు తీయకు అంటూ అఖిల్ రియాక్ట్ కావడంతో ఆ తరువాత అఖిల్ ఫొటో పెట్టాడు అతని అన్న. అయితే ఆ షాక్ నుంచి అఖిల్ కోలుకోకుండానే మరో షాక్ ఇచ్చాడు అఖిల్ అన్న బబ్లూ. సొహైల్, అఖిల్‌ల తరువాత అఖిల్ బద్ద శత్రువు అభిజిత్‌‌కి టాప్ 5లో స్థానం కల్పించాడు బబ్లు.

Akhil was shocked when his brother said that he is fan of abhijith

అంతేకాదు.. ‘అభిజిత్ భయ్యా.. నేను నీకు పెద్ద ఫ్యాన్ ని’ అంటూ హార్ట్ ఫుల్‌గా మాట్లాడాడు. దీంతో అఖిల్ నోట మాటలేదు. తాను ద్వేషించే వ్యక్తికి తన సొంత అన్న ఫ్యాన్ అని చెప్పడంతో అఖిల్ నోట మాటరాలేదు.వెంటనే అభిజిత్ లేచి నిలబడి.. దండం పెడుతూ సారీ భయ్యా.. నేను మీ వాడితో రోజు కొట్లాడుతున్నా.. క్షమించండి అని అనడంతో చాలా మెచ్యూర్డ్ ఆన్సర్ ఇచ్చాడు అఖిల్ అన్న బబ్లూ. ‘అదంతా పార్ట్ ఆఫ్ ది గేమ్ అవేం మనసులో పెట్టుకోం మేము’ అని అఖిల్ అన్న బబ్లు చాలా జన్యున్‌గా నవ్వుతూ మాట్లాడి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు.

తమ్ముడు ద్వేషించే వ్యక్తిని తన ఫ్యాన్ అని చెప్పడమే కాకుండా.. తన తమ్ముడికి మొదటి స్థానం ఇవ్వకుండా సొహైల్‌కి ఫస్ట్ ప్లేస్‌ ఇచ్చి తరువాత అఖిల్ ఫొటో పెట్టి పెద్ద షాక్ ఇచ్చాడు బబ్లు. ఇక అరియానా, అవినాష్‌లకు టాప్ 5లో స్థానం కల్పించాడు బబ్లూ. మొత్తానికి అఖిల్ అన్న సెల్ఫిష్‌గా కాకుండా గేమ్‌ని గేమ్‌లా చూసి టాప్ 5 ప్లేస్‌లు ఇవ్వడంతో అభిజిత్ ఫ్యాన్స్ మనసులతో పాటు చాలామంది మనసుల్ని గెలుచుకున్నాడు. ఇక బబ్లు కొడుకు అరుష్ కూడా ముద్దు ముద్దుగా మాట్లాడుతూ వారెవ్వా అనిపించాడు.