సల్మాన్ ఖాన్ తన కొత్త చిత్రం ‘రాధే’తో సినిమా విడుదల పద్దతిలో కొత్త ఒరవడిని సృష్టించారు. ఇతర దేశాల్లో థియేటర్లలో సినిమాను రిలీజ్ చేసి ఇండియాలో మాత్రం ఓటీటీలో వదిలారు. పే పర్ వ్యూ పద్దతిలో విడుదలైన ఈ చిత్రం 24 గంటల లోపే 42 లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది. మొదటి రోజు 100 కోట్ల వరకు ఓటీటీ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. దీంతో బడా సినిమాలు నేరుగా ఓటీటీలోకి వెళ్ళడం గురించి ఆలోచిస్తున్నాయి. తెలుగు సినిమాలు కూడ ఇదే పద్దతిలో వెళ్లాలని చూస్తున్నాయట.
వాటిలో అఖిల్ కొత్త చిత్రం ‘ఏజెంట్’ కూడ ఉందని టాక్. సురేందర్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని థియేటర్లతో పాటు ఓటీటీలో కూడ ఒకేసారి రిలీజ్ చేయాలని నిర్మాతలు యోచిస్తున్నారట. అయితే ఒకేసారి రెండు చోట్ల విడుదల అనేది వర్కవుట్ అవుతుందా అనేదే డౌట్. సల్మాన్ ఖాన్ సినిమా అంటే వేరే లెవల్ కాబట్టి ఓటతీలో జనం ఎగబడి చూశారు. పైగా థియేటర్లలో సినిమా లేదు. ఇకవేళ సినిమా హాళ్లలో గనుక చిత్రం ఉండి ఉంటే ఓటీటీలో అన్ని లక్షల వ్యూస్ సాధ్యమయ్యేవి కావు. ఒకవేళ ఓటీటీకే జనం ఓటేస్తే థియేటర్లలో వసూళ్లు సగానికి పడిపోయేవి. అంటే ఒకేసారి అటు సినిమా హాళ్లు, ఇటు ఓటీటీ అంటే పెద్ద హీరోలకే చెల్లుబాటు కాదు. అలాంటిది అఖిల్ సినిమాను రెండు చోట్లా రిలీజ్ చేయాలని నిర్మాతలు అనుకుంటే మాత్రం ఎక్కడో ఒక చోట నష్టపోయే వీలే ఎక్కువగా ఉంది.