Akhanda : ‘అఖండ’ సినిమాకి ఆ ప్రయోజనం ‘ఏపీ’ కల్పించిందా.?

Akhanda :నందమూరి బాలకృష్ణకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీరాభిమాని అంటారు. దీనికి సంబంధించి గతంలో పత్రికల్లో వచ్చిన ఓ ప్రకటనని ఉదాహరణగా చూపుతారు. అందులో కడప బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వైఎస్ జగన్.. అని వుంటుంది. అదెంత నిజం.? అన్నది వేరే చర్చ.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల వివాదానికి సంబంధించి కొత్త వ్యవహారం తెరపైకొచ్చింది. బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా విషయమై ఆ చిత్ర నిర్మాతలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఓ ఎమ్మెల్యే సాయం తీసుకుని సంప్రదింపులు చేశారట. ముఖ్యమంత్రి దగ్గరకీ విషయం వెళ్ళిందట. బాలయ్య స్వయంగా వచ్చి కలుస్తానని ముఖ్యమంత్రికి మంత్రి పేర్ని నాని ద్వారా సమాచారమిస్తే, ‘ఆయన్నెందుకు పిలవడం..

ఆయన్నెందుకు ఇబ్బంది పెట్టడం.. ఏం కావాలో చూడండి, చెయ్యండి..’ అని ముఖ్యమంత్రి తనకు చెప్పారని పేర్ని నాని వెల్లడించారు.
ఇదంతా నిజమేనా.? నిజమేనన్నది పేర్ని నాని వాదన. బాలయ్య, చిత్ర నిర్మాతలు ఆ ప్రయత్నం చేశారో లేదో వారినే అడగండంటూ మంత్రి పేర్ని నాని మీడియాకి సూచించారు కూడా.

అన్నట్టు, ‘అఖండ’ సినిమా విడుదల సమయంలో టిక్కెట్ల రేట్ల వ్యవహారం, ఇతరత్రా వ్యవహారాలపై ప్రభుత్వం చూసీ చూడనట్టు వ్యవహరించింది. ‘భీమ్లానాయక్’ సినిమాకి వెళ్ళినట్లుగా పోలీసు అధికారులు, వీఆర్వోలు, ఇతర అధికారులు థియేటర్లకు వెళ్ళి తనిఖీలు చేయలేదు.

సో, బాలయ్య సినిమా కాబట్టి.. వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ మినహాయింపులు ఇచ్చి రూల్స్ పక్కన పెట్టిందని అనుకోవాలా.?