Akhanda 2: నందమూరి బాలకృష్ణ ఒకవైపు సినిమాలలో నటిస్తున్న మరోవైపు రాజకీయాలలో కూడా బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే సినిమాల పరంగా ఈయన ఇటీవల కాలంలో వరుస హిట్టు సినిమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇటీవల సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
బాలకృష్ణ తన తదుపరిచిత్రం అఖండ సీక్వెల్ సినిమా పనులలో బిజీగా గడుపుతున్నారు. బోయపాటి దర్శకత్వంలో ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ హిమాలయాలలో జరుగుతుందని తెలుస్తుంది .ఇటీవల కుంభమేళా జరగడంతో కుంభమేళాలో కూడా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్టు సమాచారం. ఇలా కుంభమేళాలో ఒక షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న అనంతరం తదుపరి షెడ్యూల్ హిమాలయాలలో జరుపుకోబోతున్నారని తెలుస్తుంది.
ఈ నెల రెండో వారం నుంచి హిమాలయాల్లో చిత్రీకరించేందుకు బోయపాటి సిద్ధమవుతున్నారట. అయితే అందుకోసం ప్రస్తుతం ఆయన హిమాలయాల్లోని పలు అందమైన ప్రదేశాల్లో రెక్కీ నిర్వహిస్తున్నారట. ఈ షెడ్యూల్ లో బాలయ్యకు సంబంధించిన అఖండ పాత్రపై కీలక సన్నివేశాలతో పాటు ఒక భారీ పోరాట ఘట్టాన్ని కూడా హిమాలయాలలోనే చిత్రీకరించబోతున్నారని తెలుస్తుంది.
ఇలా ఈ సినిమా ఆఖండ సినిమాను మించి ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలు బాలయ్యకు జోడిగా నటి సంయుక్త మీనన్ నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాని ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమాకు తమన్నా సంగీతం అందించగా గోపి ఆచంట తేజస్విని నందమూరి నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.