Aishwarya Rajesh: భాగ్యం పాత్రకు ఐశ్వర్య ఫస్ట్ ఛాయిస్ కాదా…. ఆ ఒక్క కారణంతో ముగ్గురు రిజెక్ట్ చేశారా?

Aishwarya Rajesh: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఒకటి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐశ్వర్య రాజేష్ తన పాత్ర గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సినిమాలో భర్తను అమితంగా ప్రేమించే ఒక గృహిణిగా భాగ్యలక్ష్మి అనే పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటించారు. ఈ పాత్రకు ఈమె ప్రాణం పోసారని చెప్పాలి. అయితే ఈ సినిమాలో భాగ్యం పాత్రలో నటించడానికి ఐశ్వర్య రాజేష్ ఫస్ట్ ఛాయిస్ కాదని స్వయంగా ఆమెనే వెల్లడించారు ముగ్గురు హీరోయిన్లు రిజెక్ట్ చేసిన తర్వాత తాను ఈ సినిమాకు ఓకే చెప్పానని ఐశ్వర్య తెలిపారు. ఇక ఆ ముగ్గురు హీరోయిన్స్ ఎవరు అనే విషయాన్ని ఈమె బయట పెట్టకపోయినా వాళ్లు రిజెక్ట్ చేయడానికి గల కారణాన్ని మాత్రం తెలియజేశారు.

ఈ సినిమాలో వెంకటేష్ ఐశ్వర్య భార్యాభర్తలుగా నలుగురు పిల్లల తల్లితండ్రులుగా నటించిన విషయం తెలిసిందే. ఇలా నలుగురు పిల్లలకు తల్లిగా నటించే పాత్ర కావడంతోనే ముగ్గురు హీరోయిన్స్ ఈ సినిమాని రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. ఇలా నలుగురు పిల్లల తల్లి పాత్రలలో కనుక నటిస్తే ఇకపై తమ కెరియర్లో వచ్చే అవకాశాలన్నీ ఇలాంటి తరహా పాత్రలే ఉంటాయని దాంతో తమ కెరియర్ దెబ్బతింటుంది అన్న ఉద్దేశంతో ఆ ముగ్గురు రిజెక్ట్ చేసినట్లు తెలిపారు.

పిల్లలకు తల్లిగా నటించడం అనేది రిస్క్ కాదని.. మంచి అవకాశం అని ఐశ్వర్య రాజేష్ తెలిపారు. ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా నటించారు అయితే ఆమె కూడా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన లక్కీ భాస్కర్ సినిమాలో ఓ కుర్రాడికి తల్లి పాత్రలో నటించిన మీనాక్షి చౌదరి టాప్ హీరోయిన్గా దూసుకుపోతుంది అంటూ ఐశ్వర్య రాజేష్ కామెంట్స్ చేశారు.