ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను ఎయిరిండియా ద్వారా భారత్‌కు తరిలిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటీకే రెండు విమానాలు రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుండి భారత్‌కు చేరుకున్నాయి. ఇక ఉక్రెయిన్ నుండి వచ్చే తెలంగాణా విద్యార్థులను హైదరాబాద్ కు చేరవేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. విద్యార్థులను హైదరాబాద్‌కు చేరవేయడానికి ప్రభుత్వం ఉచితంగా టికెట్లను అందించడానికి ఏర్పాట్లను చేసిందని తెలిపారు. ఉక్రెయిన్ నుండి వచ్చే విద్యార్థులకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను న్యూఢిల్లీ, హైదరాబాద్ లలో చేయడం జరిగిందని వివరించారు. ఇప్పటికే న్యూ ఢిల్లీ తెలంగాణ భవన్, హైదరాబాద్ లోని సెక్రెటేరియేట్ లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసిన విషయాన్ని సి.ఎస్. గుర్తు చేశారు.