ఎయిర్ ఇండియా నిరుద్యోగులకు మరో తీపికబురు అందించింది. రాత పరీక్ష లేకుండా 495 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. వాక్ ఇన్ ఇంటర్వ్యూల ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో పని చేయాల్సి ఉంటుంది.
ఏదైనా గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలలో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఖాళీలు 80 ఉండగా జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఖాళీలు 64 ఉన్నాయి. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు 121, హ్యాండిమ్యాన్ ఉద్యోగ ఖాళీలు 230 ఉన్నాయి.
28 సంవత్సరాల లోపు వయస్సు ఉండటంతో పాటు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు. జాబ్ ఆధారంగా అర్హతలలో స్వల్పంగా మార్పులు ఉంటాయి. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఐటీఐ లేదా మూడేళ్ల డిప్లొమా ఉన్నవాళ్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ ఉద్యోగాలకు పదో తరగతి అర్హత సరిపోతుంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా ఉంటుంది. ఏప్రిల్ 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉదయం సమయంలో ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయి. చెన్నైలోని పల్లవరం కంటోన్మెంట్ లో ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. https://www.aiasl.in/recruitment వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.