ఒకే రోజు 15 సినిమాలు రిలీజ్ చేసిన అల్లు అరవింద్

Aha Ott Releasing 15 Movies Today
ఈరోజుల్లో ఓటీటీల హవా బాగా పెరిగింది.  థియేటర్లు లేకపోవడంతో ప్రేక్షకులు డిజిటల్ మీడియానే ఎక్కువగా వినియోగిస్తున్నారు. అందుకే ఓటీటీలో ఎప్పటికప్పుడు మంచి కంటెంట్ తీసుకొచ్చి ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం చేస్తున్నాయి.  మొదటి తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’ కూడ ప్రేక్షకుల్ని తనవైపు తిప్పుకోవడానికి గట్టిగా ట్రై చేస్తోంది.  ఈ శుక్రవారం ఒక్కరోజే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 సినిమాలను రిలీజ్ చేస్తోంది.  వాటిలో రీసెంట్ సినిమాలతో పాటు పాత క్లాసిక్స్ కూడ ఉన్నాయి.  
 
ఇంతకీ ఆహా రిలీజ్ చేయబోయే సినిమాల జాబితాలో ‘యుద్ధం శరణం, అందాల రాక్షసి, దిక్కులు చూడకు రామయ్య, ఊహలు గుసగుసలాడే, ఈగ, బంగారు బుల్లోడు, భైరవ ద్వీపం, చిరు నవ్వుతో, ఘటోత్కచుడు, కొబ్బరి బొండం, రాజేంద్రుడు గజేంద్రుడు, వినోదం, వేటుగాడు, లీసా, పొగరు, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ లాంటి సినిమాలు ఉన్నాయి.  కొత్త సినిమాలను చూడాలనుకునే వారితో పాటు పాత చిత్రాలను కూడ ఇష్టపడేవారికి అల్లు అరవింద్ సారథ్యంలో నడుస్తున్న ఆహా ఓటీటీ ఈ వారం మొత్తానికి సరిపడ ట్రీట్ ఇస్తోందన్నమాట.  

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles