జీ5లో రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఒరిజినల్ ‘అహ నా పెళ్ళంట’. నవంబర్ 17 నుంచి ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఓ పాతికేళ్ల యువకుడు పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే ఆక్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలేంటనేదే అసలు కథ. మన కథానాయకుడు పెళ్లి చేసుకోవాలనుకున్న పెళ్లి కూతురు తన ప్రేమికుడు వెళ్లిపోతుంది. అప్పుడు మన హీరో ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. తీరా ఆ కథ ఎలాంటి మలుపులు తీసుకుందనేదే సినిమా.
రీసెంట్‌గా విడుదలైన ఈ వెబ్ సిరీస్ అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ 50 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ మార్క్‌ను రీచ్ అయ్యింది. అంతే కాకుండా ఐఎండీబీ ప్రకటించిన టాప్ టెన్ ప్రేక్షకాదరణ పొందిన వెబ్ సిరీస్‌ల లిస్టులోనూ ‘అహ నా పెళ్ళంట’ చోటు దక్కించుకుంది. తెలుగులో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనింగ్ సిరీస్‌ను అన్నీ భాషల్లో ప్రమోట్ చేశారు. కంటెంట్ చాలా బావుందని అన్నీ చోట్ల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.
‘అహ నా పెళ్ళంట’ .. అతి కొద్ది సమయంలోనే 50 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ సాధించి కామెడీ వెబ్ సిరీస్‌లలో ఓ రికార్డ్‌ను నెలకొల్పింది. సినీ విమర్శకులు సైతం వెబ్ సిరీస్ బావుందని అప్రిషియేట్ చేశారు. అలాగే ఆడియెన్స్ కూడా అభినందిస్తున్నారు. హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ శివానీ రాజశేఖర్ మధ్య కెమిస్ట్రీ మెయిన్ హైలైట్ అని అందరూ అంటున్నారు.
హీరో హీరోయిన్ జోడీ మధ్య ఉండే కెమిస్ట్రీతో పాటు క్లీన్ కామెడీ, రొమాన్స్ అన్నీ చక్కగా కుటుంబం అంతా కలిసి చూసేలా ఉందని అందరూ అంటున్నారు. ఈ వారాంతాన్ని మీ ఫ్యామిలీతో కలిసి సరదాగా గడపాలని అనుకుంటే వెంటనే అహ పెళ్ళంట సినిమా చూసేయండి.
నటీనటులు:
రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్, ఆమని, హర్షవర్ధన్, పోసాని కృష్ణమురళి, గెటప్ శీను, జబర్దస్త్ రాజమౌళి, తాగుబోతు రమేష్, మధునందన్, భద్రమ్, రఘు కారుమంచి, దొరబాబు తదితరులు
సాంకేతిక వర్గం:
నిర్మాతలు: రాహుల్ తమడ, సాయిదీప్ రెడ్డి బుర్రా,
దర్శకత్వం : సంజీవ్ రెడ్డి,
మ్యూజిక్ డైరెక్టర్ : జుడా శాండి,
సినిమాటోగ్రాఫర్: నగేశ్ బానెల్,
కథ, స్క్రీన్ ప్లే: దావూద్ షేక్,
డైలాగ్స్: కళ్యాణ్ రాఘవ
లిరిక్స్: రఘురామ్,
ఎడిటింగ్: మధు జి.రెడ్డి,
ప్రొడక్షన్ డిజైన్: దివ్యా రెడ్డి,
ఆర్ట్ డైరెక్టర్ : పి.ఎస్.వర్మ,
కాస్ట్యూమ్స్: లంకా సంతోషి,
పి ఆర్ ఓ : నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)