కరోనా సమయంలో ఓటీటీలకు మంచి ఆదరణ లభించింది. ఈ క్రమంలోనే తెలుగులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆహా పేరుతో ఓటీటీ సంస్థను ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆహా వేదికగా ఎన్నో సినిమాలు వెబ్ సిరీస్ లు, టాక్ షోలు, సింగింగ్ కాంపిటీషన్స్ ప్రసారం అవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశాయి. ఈ క్రమంలోనే ఆహా వేదికగా సరికొత్త డాన్స్ షో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ యాంకర్ ఓంకార్ ఎంటర్టైన్మెంట్ ఆహాతో కలిసి ఈ డాన్స్ కాంపిటీషన్ కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.
డాన్స్ ఐకాన్ అనే కార్యక్రమం ద్వారా ఓంకార్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ డాన్స్ కాంపిటీషన్ లో పాల్గొనాలనుకునేవారు నిర్వాహకులు నిర్వహిస్తున్నటువంటి ఆడిషన్స్ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వారు 60 సెకండ్ల నిడివిగల ఒక డాన్స్ వీడియోని danceikon@oakentertainments.com అని మెయిల్ ఐడీకి పంపించాలని వెల్లడించారు.ఆడిషన్స్ ఈనెల 22వ తేదీ నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
డాన్స్ లో ఎంతో ప్రతిభ గల వారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎంతో మంచి అవకాశం అని చెప్పాలి. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునేవారు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారై ఉండాలి అలాగే వీరి వయస్సు ఐదు నుంచి 50 సంవత్సరాల వరకు ఉండాలని పేర్కొన్నారు.ఇప్పటివరకు ఎన్నో డాన్స్ షోలు ద్వారా ఇండస్ట్రీకి అద్భుతమైన డాన్సర్ లు పరిచయమయ్యారు. ఈ క్రమంలోనే మరి కొత్త డాన్స్ షో ద్వారా మరింతమందికి ఈ వేదికగా అవకాశం కల్పించనున్నారు.