అల్లు అరవింద్ సారథ్యంలో నడుస్తున్న ‘ఆహా’ ఓటీటీ కొత్త సినిమాల వేటలో ముందుంది. థియేటర్లు తెరుచుకున్నా తెరుచుకోకపోయినా ప్రేక్షకుల్ని తనవైపుకు తిప్పికోవడమే ధ్యేయంగా పెట్టుకున్న ఆహా ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ అందుబాటులో ఉండేలా చూసుకుంటోంది.
అందులో భాగంగానే కొత్త, పాత సినిమాలను విపరీతంగా కొంటోంది. నిన్న శుక్రవారం ఏకంగా 15 సినిమాలను రిలీజ్ చేసి వార్తల్లో నిలిచింది. ఇవి కాకుండా తాజాగా ఇంకో మూడు కొత్త సినిమాలను కొనుగోలుచేసింది. నాగ చైతన్య, శేఖర్ కమ్ముల కాంబినేషన్లో రూపొందుతున్న ‘లవ్ స్టోరీ’ చిత్రాన్ని ఆహా దక్కించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇదే కాదు నాగశౌర్య నూతన చిత్రం ‘లక్ష్య’, అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ సినిమాల రైట్స్ కూడ ఆహా చేతిలోనే ఉన్నాయట. అయితే ఈ మూడు సినిమాలను థియేటర్లలో విడుదలయ్యాకనే ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నారు.
గీతా ఆర్ట్స్, గీతా ఆర్ట్స్ 2 సంస్థల్లో నిర్మితమయ్యే సినిమాలే కాకుండా ఇతర నిర్మాణ సంస్ధలు నిర్మించే సినిమాల మీద కూడ ఆహా ఎక్కువగా ఆసక్తి చూపుతోంది. అమెజాన్ ప్రైమ్ లాంటి బడా ఓటీటీలతో పోటీపడి మరీ చిత్రాలను కొనుగోలు చేస్తోంది.