ప్రభాస్ “సలార్” పై మళ్ళీ సెన్సేషనల్ క్లారిటీని ఇచ్చిన ప్రశాంత్ నీల్.!

Salaar : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లలో తన కెరీర్ లోనే మరో భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమా “సలార్” కూడా ఒకటి. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా తన గత హిట్ సినిమాలు కేజీఎఫ్ 1, 2 కి మించి టన్నుల లెవెల్లో హైప్ ఇచ్చే లెక్కలో ఉంటుంది అని చిత్ర యూనిట్ ఆల్రెడీ చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు.

అయితే ఈ సినిమా అనౌన్స్ అయ్యి కొన్నాళ్ల తర్వాత అసలు ఈ సినిమా డైరెక్ట్ సినిమాగా చేస్తున్నారా లేక రీమేక్ సినిమానా అనే ప్రశ్న గట్టిగా వినిపించింది. అయితే దీనికి ఈ సినిమా సంగీత దర్శకుడు రవి బసృర్ ఇది ప్రశాంత్ నీల్ ఫస్ట్ సినిమా “ఉగ్రం” కి రీమేక్ గా చేస్తుందని చెప్పాడు.

అయితే అక్కడ నుంచి ఆ టాక్ పెద్ద ఎత్తున వైరల్ అయ్యిపోగా తర్వాత మేకర్స్ ఇది రీమేక్ కాదని క్లారిటీ ఇచ్చారు. అయితే మళ్ళీ లేటెస్ట్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ నే స్వయంగా క్లారిటీ ఇచ్చినట్టు సినీ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ సినిమా అసలు ఏ సినిమాకి కూడా రీమేక్ కాదు పూర్తిగా కొత్త కథ.

అసలు నా సినిమాల్లోనే కాదు ఏ సినిమాల్లో కూడా కాపీ కొట్టినది కాదని సెన్సేషనల్ క్లారిటీని అందించాడు. దీనితో అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు కాస్త ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా హోంబళే ఫిల్మ్స్ వారు తెరకెక్కిస్తున్నారు.