Prabhas : ప్రభాస్ మళ్లీ అదే తప్పు..ఎంత స్టార్డం ఉంటే మాత్రం ఏంటి?

Prabhas :ఇప్పుడు మొత్తం ఇండియన్ సినిమా దగ్గరే మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే తాను ఇంత భారీ స్టార్డం తెచ్చుకున్నా తన మూలాలు మాత్రం మన తెలుగు సినిమా నుంచే ఉంటాయి. కానీ తన ఇప్పుడు భారీ సినిమా ‘రాధే శ్యామ్’ అలానే తన లాస్ట్ సినిమా ‘సాహో’ విషయంలో చేసిన తప్పులే మళ్లీ చేస్తున్నట్టు అనిపిస్తోంది.

తెలుగు తో పాటు హిందీలో కూడా ప్రభాస్ కి మంచి మార్కెట్ వచ్చింది అలా అని తెలుగు వెర్షన్ కంటే ఎక్కువ ప్రియార్టీ హిందీ వెర్షన్ కి ఇస్తుండడం ఎంత వరకు కరెక్ట్? లాస్ట్ టైం సాహో కి కూడా ఇలా చేస్తేనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కూడా రాధే శ్యామ్ కి కూడా తెలుగు కంటే హిందీ ఆడియెన్స్ కోసమే ఎక్కువ ప్రాధాన్యత, జాగ్రత్తలు సినిమాలో తీసుకున్నట్టు అనిపిస్తుంది.

లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ హిందీ సాంగ్ అప్డేట్ కూడా తెలుగు వెర్షన్ పట్ల నిర్లక్ష్యం ఎక్కడో తెలియజేస్తుంది. హిందీలో ఒక్కటే సాంగ్ వచ్చినా ఇప్పుడు తెలుగు లో వచ్చిన రెండు సాంగ్స్ కన్నా కూడా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది.

ఇంకా చెప్పాలి అంటే ఆషికి ఆగయి సాంగ్ ని హిందీలో తెరకెక్కించి దానికి తెలుగు సాంగ్ ఎడిట్ చేసిన భావన ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. మరి ఈ ప్లాన్ ప్రభాస్ దా లేక నిర్మాతలదా కానీ తెలుగు వెర్షన్ కి అప్పుడు సాహో విషయం లో చేసిన తప్పే మళ్లీ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మరి ఫైనల్ గా రిజల్ట్ ఎలా వస్తుందో చూడాలి.