Pawan Kalyan Shocking Remuneration : గాసిప్స్ : మళ్ళీ హాట్ టాపిక్ గా పవన్ కళ్యాణ్ షాకింగ్ రెమ్యునరేషన్.!

Pawan Kalyan Shocking Remuneration

Pawan Kalyan Shocking Remuneration : టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ క్రేజ్ ఉన్న స్టార్ హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. అయితే పవన్ హీరోగా ఇప్పుడున్న పరిస్థితిలో ఓ సినిమాకి సైన్ చేస్తే మినిమమ్ 50 కోట్లు ఇచ్చేందుకు ఏ నిర్మాత అయినా రెడీగా ఉంటున్నారు. అలాగే తన లాస్ట్ భారీ హిట్ సినిమా “భీమ్లా నాయక్” కి గాను ఏకంగా 50 కోట్లు తీసుకున్నారన్న మాట ఆ మధ్య పెద్ద ఎత్తునే కలకలం రేపింది.

ఇక ఇప్పుడు ఇంకా కొన్ని సినిమాలు తీస్తుండగా వాటిలో కొత్తగా ఇంకో రీమేక్ ని పవన్ పట్టాలెక్కించనున్నారని కన్ఫర్మ్ అయ్యింది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా నిజమే అని తెలుస్తుంది. మరి దీనికే పవన్ తీసుకోబోయే రెమ్యునరేషన్ షాకింగ్ గా మారింది.

ఈ సినిమాకి గాను కేవలం పవన్ 20 రోజులు మాత్రమే డేట్స్ అలాట్ చెయ్యగా ఈ 20 రోజులకి గాను ఏకంగా 60 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఇదే నిజం అయితే ఇంత తక్కువ రోజులకి అంత ఎక్కువ పారితోషకం తీసుకునే ఏకైక హీరోగా పవన్ నిలుస్తాడని చెప్పాలి.

మరి ఈ గాసిప్ లో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది. అలాగే ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కూడా నటించనుండగా సముద్రఖని తీసిన ‘వినోదయం’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కనుంది.