Again NTR 30 : ఇన్సైడ్ టాక్ : తిరిగి ఆ హీరోయిన్ దగ్గరకే వచ్చిన “ఎన్టీఆర్ 30” యూనిట్.?

Again NTR 30 : టాలీవుడ్ లో భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోస్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. మరి ఎన్టీఆర్ లేటెస్ట్ గా నటించిన తన బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ సినిమా తో మంచి క్రేజ్ ను కూడా సంపాదించుకోగా దీని తర్వాత చేసే సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే మరి ఈ లిస్ట్ లో ఎన్టీఆర్ 30వ సినిమాగా దర్శకుడు కొరటాల శివతో ఓ భారీ పాన్ ఇండియా సినిమాని ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా విషయంలో గత కొన్ని రోజులు నుంచి హీరోయిన్ ఆలియా భట్ తప్పుకుంది అని ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయ్యిపోయినట్టు వార్తలు వచ్చేసాయి.
దీనితో ఇపుడు చిత్ర బృందం కొత్త హీరోయిన్ కోసం వెతకడం స్టార్ట్ చేశారట. మరి ఈ సెర్చింగ్ లో మళ్ళీ వీరు మొదట ఎన్టీఆర్ సరసన అనుకున్న హీరోయిన్ దగ్గరకే వచ్చి ఆగినట్టు తెలుస్తుంది. ఆమె మరెవరో కాలేదు ఆలియా కన్నా ముందు ఈ ప్రాజెక్ట్ చేయలేనని చెప్పిన బాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ కియారా అద్వానీ అట.
ఈమెని కొరటాల నే ఫస్ట్ టైం టాలీవుడ్ కి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. మరి ఇపుడు మళ్ళీ ఆమెతో సంప్రదింపులు స్టార్ట్ చేసారని ఇన్సైడ్ టాక్. మరి ఇవన్నీ ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. ప్రస్తుతం ఈమె అయితే RRR మరో హీరో రామ్ చరణ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.