Bheemla Nayak : గాడ్ ఆఫ్ మాసెస్ పవన్ కళ్యాణ్ హీరోగా రానా దగ్గుబాటి కూడా మరో హీరోగా నటించిన టాలీవుడ్ మరో బిగ్ మల్టీ స్టారర్ చిత్రం “భీమ్లా నాయక్”. దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ చిత్రం ఏపీలో ఎలాంటి పరిస్థితిలో రిలీజ్ అయ్యిందో అందరికీ తెలిసిందే.
అప్పటి వరకు రావాల్సిన కొత్త జివో ప్రకారం రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఆ జివో రాకుండానే పవన్ సూచన మేరకు రిలీజ్ అయ్యింది. మరి ఇది పక్కన పెడితే అప్పుడు ఈ సినిమాకి అదే పెద్ద షాక్ అనుకుంటే ఇప్పుడు ఇంకో ఊహించని షాక్ తగిలిందని చెప్పాలి.
ఈ సినిమాకి ఏపీలో ఇప్పటికీ కూడా అదే పాత ధరలు కొనసాగుతుండడం ఆసక్తిగా మారిన అంశం. నిన్ననే వచ్చిన సూర్య “ఈటి” చిత్రానికి అలాగే ఈరోజు వచ్చిన రాధే శ్యామ్ కి కూడా కొత్త ధరలు కనిపిస్తుండగా భీమ్లా నాయక్ కి మాత్రం ఇంకా పాత ధరలలోనే కొనసాగిస్తున్నారు.
సరే ఈటి, రాధే శ్యామ్ లు కొత్త జివో వచ్చిన తర్వాత రిలీజ్ అయ్యాయి అనుకున్నా అంతకు ముందే వచ్చిన ఆడవాళ్ళూ మీకు జోహార్లు సినిమాకి కూడా కొత్త ధరలే అనేక చోట్ల బుకింగ్స్ లో కనిపిస్తున్నాయి. దీనితో పవన్ సినిమాకి ఏపీలో మళ్ళీ షాక్ తప్పలేదని చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమా మూడో వారంలోకి ఎంటర్ అయ్యింది పైగా ఏపీలో నష్టాల్లోనే కొనసాగుతుంది. మరి ఫైనల్ గా ఈ సినిమా ఎక్కడ ఆగుతుందో చూడాలి.