AP Govt : గత కొన్ని నెలల నుంచి కూడా టాలీవుడ్ లో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న సంచలనాత్మక నిర్ణయాలు మూలాన ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అనేది చూస్తూనే ఉన్నాము. ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ కి ఇబ్బంది కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటుండడంతో టాలీవుడ్ బడా నిర్మాతలు హీరోలు తలలు పట్టుకుంటున్నారు.
అయినా ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నా ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన లభించకపోయేసరికి న్యాయస్థానం దగ్గరే తమ సమస్యను పరిష్కరించుకున్నారు. దీనితో నిన్నటి నుంచి కూడా ఓ రేంజ్ లో ఈ అంశం వైరల్ అవుతుంది.
టికెట్ ధరలను నిర్దేశిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో ని రద్దు చేసి పాత రేట్లు యథావిధిగా ఉండాలని హై కోర్ట్ తీర్పు ఇవ్వడంతో ఏపీ ప్రభుత్వానికి షాక్ లా మారగా మరి దీనిని సవాలు చేస్తూ టాలీవుడ్ నిర్మాతలకి షాక్ ఇచ్చేలా ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకి వెళ్లనున్నారట.
మరి అసలు రాష్ట్రంలో ఇంకో సమస్యే లేనట్టు ఏపీ ప్రభుత్వం ఎందుకు టాలీవుడ్ పై కన్నేసిందా అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు రాబోతున్న పుష్ప రేట్లు పై ఇంకా క్లారిటీ రాలేదు. అలాగే బెనిఫిట్ షోలపై కూడా సమాచారం రావాల్సి ఉంది.