RRR Movie And KGF 2 : “RRR” తర్వాత ఓవర్సీస్ లో రిలీజ్ కి ముందు హిస్టరీ క్రియేట్ చేస్తున్న “కేజి ఎఫ్ 2”.!

RRR Movie And KGF 2 : ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ ఓ ఇండియన్ సినిమా కోసం ఆసక్తి గా ఎదురు చూస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది కన్నడ ఇండస్ట్రీ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “కేజీఎఫ్ చాప్టర్ 2”.
బాహుబలి2 తర్వాత మళ్ళీ ఓ సీక్వెల్ కోసం ఆడియెన్స్ వెర్రెత్తి పోయేలా చేసిన ఏకైక సినిమా ఇదే. అయితే కన్నడ రాకింగ్ హీరో యష్ నటించిన ఈ సినిమాని ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు.
మరి కొన్ని రోజుల్లో ఈ సినిమా రిలీస్ కాబోతుండగా అన్ని సినిమాల్లా లానే మొదటి దీనికి కూడా ముందు ఓవర్సీస్ బుకింగ్స్ ని ఓపెన్ చేసారు. అయితే ఇది ఆశ్చర్యకరంగా దీనికి ముందు భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) ని మించి వసూళ్లు బుకింగ్స్ నమోదు చేస్తుండడం గమనార్హం.
ఈ సినిమా ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ చేసిన 12 గంటల్లోనే 5000 కి పైగా టికెట్స్ అమ్ముడుపోయాయట.
ఇది ఒక ఆల్ టైం రికార్డు అన్నట్టు ఇప్పుడు తెలుస్తోంది. మరి ఇదే కాకుండా ప్రపంచ దేశాల్లో మొట్ట మొదటిసారిగా ఇటలీ మరియు గ్రీస్ దేశాల్లో రిలీజ్ అవుతున్న తొలి దక్షిణ భారత దేశ సినిమా గా ఇది నిలిచింది అని కూడా ఖరారు అయ్యింది.
దీని బట్టి ఈ సినిమా క్రేజ్ ఏ లెవెల్లో ఉందో అందరూ అర్ధం చేసుకోవచ్చు.
మరి ఈ సినిమా లో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ క్రూరమైన విలన్ పాత్రలో నటించారు. అలాగే రవీనా తాండన్ ప్రకాష్ రాజ్ మరియు రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం అన్ని భాషల్లో ఆడియెన్స్ చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.