Radhe shyam : ఇదిగో ప్రబాస్ సినిమా.. అదిగో ప్రబాస్ సినిమా అంటూ ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. అవును మరి, ‘బాహుబలి’తో ప్రబాస్ దక్కించుకున్న ప్యాన్ ఇండియా ఇమేజ్ అలాంటిది మరి. ప్రబాస్‌తో సినిమా అంటేనే ఆటోమెటిగ్గా అంచనాలు ఆకాశానికందేస్తున్నాయ్.
అందుకే ఆయనతో సినిమా అంటే, ఆ రేంజే వేరప్పా.. అనేలా అయిపోయింది పరిస్థితి. అంతా బాగానే వుంది కానీ, ఎదురు చూసి, ఎదురు చూసి కళ్లు కాయలు కాసేస్తున్నాయ్. ‘బాహుబలి’ తర్వాత ఆ రేంజ్ హిట్ తన ఖాతాలో వేసుకోలేకపోయాడు ప్రబాస్.
అఫ్‌కోర్స్ ఆ తర్వాత వచ్చినవి రెండు సినిమాలే అనుకోండి. అంచనాలేమో ఆకాశంలో. ఫలితాలేమో పాతాళంలో అన్నట్లుగా తయారైంది పాపం ప్రబాస్ సినిమా పరిస్థితి. ‘సాహో’ విషయంలో ఏదో సరిపెట్టుకున్నారు. కానీ, ‘రాధేశ్యామ్’ రిజల్ట్ మాత్రం సాధారణ అభిమానులే కాదు, ప్రబాస్ అభిమానులు కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు.
దాంతో ఇమేజ్ సంగతి దేవుడెరుగు. తన రెమ్యునరేషన్ అయితే, తగ్గించేసుకోవాలనే డెసిషన్‌కి వచ్చేశాడట ప్రబాస్. భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకునే ప్రబాస్ తన రెమ్యునరేషన్‌లో దాదాపు 25 శాతం తగ్గించేసుకున్నాడంటూ నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయ్. అంతేకాదు, భారీగా నష్టపోయిన రాధేశ్యామ్ నిర్మాతలను కూడా ప్రబాస్ ఆదుకున్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ప్యాన్ ఇండియా ఇమేజ్ ప్రబాస్‌కి పెద్ద చిక్కే తెచ్చి పెట్టింది పాపం. ప్రబాస్ తాజా నిర్ణయంతో తదుపరి ప్రాజెక్టులు ఏవిధంగా ఎఫెక్ట్ అవుతాయో చూడాలి మరి.