“పుష్ప” టీజ్ : పర్ఫెక్ట్ పాన్ ఇండియా బొమ్మలా చెక్కిన సుకుమార్.!

Pokiri style of twist in Pushpa
 
 
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తన హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన ఇంట్రెస్టింగ్ భారీ చిత్రం “పుష్ప”. రెండు పార్ట్స్ గా ప్లాన్ చేసిన ఈ భారీ సినిమా అంతకంతకూ ఆసక్తి పెంచుతూ వెళుతుంది. అయితే అల్లు అర్జున్ సినిమాలకు ఎలా అయితే కొత్త రకం ప్రమోషన్ లు ఉంటాయో అలాగే ఇప్పుడు ట్రైలర్ ని టీజ్ చేసే వీడియో ని మేకర్స్ రిలీజ్ చేశారు.
 
 
మరి ఇది మాత్రం సూపర్ ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పాలి. ప్రతీ షాట్ ని కూడా సుకుమార్ ఆసక్తికరమైన టేకింగ్ తో నింపి పర్ఫెక్ట్ పాన్ ఇండియా సినిమా వీక్షకులు ఏం కోరుకుంటారో ఆ థ్రిల్ ని తీసుకురాగలిగారు. ఒక్కో పాత్రని చూపిస్తూ లాస్ట్ లో అల్లు అర్జున్ పై షాట్ ఇంకా తనపై ఏక్షన్ సన్నివేశాలు కూడా మరింత రసవత్తరంగా అనిపించాయి. మొత్తానికి మాత్రం పుష్ప రాజ్ గట్టిగా కొట్టేలా ఉన్నాడు అనిపిస్తుంది.