మరో ఏడాది టీడీపీ నాయకులకు తప్పని కష్టాలు, అయినా కూడా చంద్రబాబు కనికరించడా!

Nara Chandra Babu Naidu

కరోనా వల్ల ఎవరికి ఎన్నో కష్టాలు వచ్చాయో తెలియదు కానీ టీడీపీ నాయకులకు మాత్రం తీవ్రమైన కష్టాలు వచ్చాయి. ఆ కష్టాలను టీడీపీ నాయకులు, కార్యకర్తలు తట్టుకోలేపోతున్నారు. కానీ ఈ కష్టాలకు సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే కారణం. దేశంలో కరోనా ప్రారంభమైన్నప్పటి నుండి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లోనే ఉంటూ రాజకీయాలు నడిపిస్తున్నారు. అయితే బాబు ఇలా హైదరాబాద్ లో ఉండటం టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు అస్సలు నచ్చడం లేదు.

cbn telugurajyam
cbn telugurajyam

మరో ఏడాది కష్టాల్లో టీడీపీ నాయకులు

జూమ్ మీటింగ్ లతో పార్టీని నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు ఏపీలోకి రావాలని టీడీపీ నాయకులు కోరుతున్న తరుణంలో చంద్రబాబు నాయుడు వాళ్లకు ఒక శుభవార్త చెప్పారు. తాను ఏపీకి వస్తున్నానని, ఏపీ మొత్తం పర్యటనలు కూడా చేస్తానని మాటలు కూడా ఇస్తున్నారు. అయితే అదంతా జరిగితే మాత్రం ఇప్ప్పుడు కాదంట కరోనా మొత్తం పోయిన తరువాత అంటూ టీపీడీ నాయకులకు, కార్యకర్తలకు తెలిపారు. పర్యటనలు చేస్తానని చెప్పడం మంచిదే కానీ కరోనా పోయిన తరువాత అంటే మరో ఏడాది తాము ఇలా వర్చువల్ నాయకుడి ఆదేశాలే వినాలా అంటూ టీడీపీ నాయకుల ఆశ్చర్యపోతున్నారు.

మరి పార్టీ పరిస్థితి ఏంటి?

చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఉండటం వల్ల ఇప్పటికే చాలామంది టీడీపీ నేతలు వైసీపీలోకి వెళ్తున్నారు. ఇలానే జరిగితే రానున్న రోజుల్లో పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందని టీడీపీ నాయకులే చెప్తున్నారు. సరే పెద్ద నాయకులు టీడీపీకి దెబ్బకొట్టడం ఇప్పటి మాట కాదు, ఎప్పటి నుంచో ఆ ముచ్చట ఉంది అనుకున్నా ఇపుడు క్యాడర్ కూడా ఎక్కడికక్కడ చెల్లాచెదురు అవుతోంది. వైసీపీ తెలివిగా టీడీపీలోని కీలక నాయకులను తమ పార్టీలోకి లాగేస్తోంది. ఇక మరో వైపు లోకల్ బాడీ ఎన్నికలు జరిగేనాటికి వార్ వన్ సైడ్ చేయడానికి వైసీపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇవన్నీ చూసిన మీద తమ్ముళ్ళు చెబుతున్న మాట ఒక్కటే. కరోనా తగ్గిన తరువాత చంద్రబాబు ఏపీకి వచ్చినా పార్టీ ఉంటుందా అన్నదే పెద్ద డౌటుట. మరి ఈ కష్టాలను తీర్చడానికి, పార్టీ ఆదుకోవడానికి బాబు కరోనా పోవడానికంటే ముందే ఏపీకి వేస్తారేమో వేచి చూడాలి.