AP: మిత్రుడిగా శైలజనాథ్ కు నా సలహా….ఆ పార్టీలో విలువలు ఉండవు: డొక్కా మాణిక్యం

AP: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సింగనమల నియోజకవర్గం మాజీ మంత్రి శైలజ నాథ్ నేడు ఉదయం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఈయన వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెండు సార్లు సింగనమల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి విద్యాశాఖ మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించారు.

ఇలా కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేస్తున్న శైలజనాథ్ కాంగ్రెస్ పార్టీ తర్వాత పదేళ్లపాటు ఇతర పార్టీలలోకి వెళ్ళలేదు కానీ ఇప్పుడు ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతో ఈయన చేరిక వెనుక గల కారణాలు ఏంటి అంటూ పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తం చేస్తూ చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే డొక్కా మాణిక్యం వరప్రసాద్ శైలజనాథ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడ పట్ల స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఈ సందర్భంగా డొక్కా మాణిక్యం మాట్లాడుతూ సాకే శైలజ నా మిత్రుడుగా నేను ఆయనకు ఒక సలహా ఇస్తున్నాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది విలువలు లేనటువంటి పార్టీ ఆ పార్టీలోకి చేరేటప్పుడు చాలా మంచిగా ఉంటుంది కానీ ఒకసారి వెళ్లిన తర్వాత జగన్ ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తారని అక్కడ ఉన్నటువంటి వారికి ఎలాంటి విలువ కూడా ఉండదని తెలిపారు.

ఇక మాదిగలకు వ్యతిరేక పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అని డొక్కా మాణిక్యం తెలిపారు. భ్యవిష్యత్తు బాగుండాలంటే శైలజనాద్ ఆ పార్టీలో జాయిన్ అవ్వకుండా ఉంటే మంచిదని మాణిక్య వర ప్రసాద్ సలహా ఇచ్చారు. ప్రస్తుతం డొక్కా మాణిక్య వరప్రసాద్ చేసిన ఈ వైరల్ అవుతున్నాయి.