బుల్లితెర మీద ఎన్నో టీవీ షోలో ప్రసారం అవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో కూడా మంచి ప్రేక్షకాదరణ పొందింది. గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా పాపులర్ అయ్యారు. ఈ కామెడీ షో ఎంతో మంది కమెడియన్ల కు జీవితాలను ఇచ్చింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు మూడు పూటలా తిండి తినటానికి కూడా అవస్థలు పడుతున్న వారికి మల్లెమాల వారు జబర్దస్త్ లో అవకాశం ఇవ్వటం వల్ల ప్రస్తుతం వారు వారి కుటుంబాలను సంతోషంగా చూసుకోవడమే కాకుండా నలుగురికి సహాయం చేసే స్థాయిలో ఉన్నారు. అలా జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఆనంద్ కూడా ఒకరు.
ఇటీవల ఆనంద్ తన భార్యతో కలిసి క్యాష్ షో లో పాల్గొన్నాడు. గత వారం జరిగిన క్యాష్ ఎపిసోడ్ లో జబర్ధస్త్ కమెడియన్లు శాంతి కుమార్, ఆనంద్, కొమరం, సత్తిపండు తమ భార్యలతో కలసి క్యాష్ షో లో సందడి చేశారు. ఈ షో లో సుమ వీరందరికీ విచిత్రమైన టాస్క్ లు ఇచ్చి ప్రేక్షకులని బాగా ఎంటర్టైన్ చేసింది. అంతేకాకుండా వారి పర్సనల్ లైఫ్ లో జరిగిన సంఘటనల గురించి కూడా అడిగింది. ఈ సందర్భంగా శాంతి కుమార్, కొమరం తమ జీవితంలో ఉన్న చేదు అనుభవాల గురించి చెప్తూ కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఈ క్రమంలో సుమ ఆనంద్ ని కూడా నీ భార్యకు తెలియని విషయాల గురించి చెప్పమని అడిగింది.
ఆనంద్ మాట్లాడుతూ… మాది ప్రేమ వివాహం. ఫేస్ బుక్ ద్వారా నా భార్యా నాకు పరిచయం అయ్యింది. ఆ సమయంలో నేను ఒక చిన్న ఆర్టిస్టుని. ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు ఉండేవి. అప్పుడు రోజు 50 రూపాయలు పెట్టీ రీఛార్జ్ చేసుకొని సాయంత్రం మాత్రమే మాట్లాడేవాడిని. తనకి డౌట్ వచ్చి నువు ఎందుకు సాయంత్రం మాత్రమే మాట్లాడుతావు అని అడిగింది. అంతే చాలా బిజిగా ఉండేవాడిని అని చెప్పాను. ఒకసారి నేనూ తనకి ప్రపోజ్ చేసినప్పుడు తను ఒప్పుకోలేదు. కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పింది. అమ్మాయిలు మొదట ఫ్రెండ్షిప్ అని తర్వాత ప్రేమ అంటరాని అందరికీ తెలిసినదే కదా . అందుకని ఫ్రెండ్ గా కంటిన్యూ అయ్యాను. తరువాత తను నా ప్రేమని అంగీకరించింది. కానీ ఇంట్లో తన తల్లి దండ్రులను ఎదురించే దైర్యం చేయలేదు. ఒకవైపు నన్ను వదులుకోలేక, మరొకవైపు తన పేరెంట్స్ ని వదులుకోలేక చాలా నరకం అనుభవించింది. కానీ ఒకరోజు దైర్యం చేసి ఇల్లువదిలి నా కోసం వచ్చేసింది. అప్పటినుండి తన చెయ్యి ఇప్పటి వరకూ వదలలేదు అంటూ తన లవ్ స్టోరీ చెప్పుకొచ్చాడు.