‘ఆదిపురుష్’ టీమ్ మొత్తానికి వ్యాక్సినేషన్ ఫస్ట్ డోస్

Adipurush team done with first dose of vaccine
Adipurush team done with first dose of vaccine
 
కరోనా ఇండస్ట్రీ జనాలను కూడ ముప్పుతిప్పలు పెడుతోంది.  ఇప్పటికే డైరెక్షన్ టీమ్, ఇతర టెక్నికల్ బృందాల్లో ఉండే చాలామంది వ్యక్తులు కరోనా కారణంగా కన్నుమూశారు. చాలామంది నటీనటులు, దర్శకులు కరోనా బారినపడ్డారు. అందుకే ఈసారి షూటింగ్ అంటూ స్టార్ట్ చేస్తే అందరూ వ్యాక్సిన్ తీసుకునే సెట్లోకి అడుగుపెట్టాలని చిత్ర బృందాలన్నీ డిసైడ్ అయ్యాయి. ప్రభాస్ ‘ఆదిపురుష్’ టీమ్ సైతం ఇదే డిసైడ్ అయింది.  జూన్ నెలాఖరు లేదా జూలై నుండి చిత్రీకరణ మొదలుపెట్టాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. 
 
అందుకే కొన్నిరోజుల క్రితం నుండే చిత్ర బృందంలోని సభ్యులందరికీ వ్యాక్సినేషన్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికి సభ్యులందరికీ ఫస్ట్ డోస్ కంప్లీట్ అయింది.  ఇక షూటింగ్ మొదలయ్యాక ఇంకో రెండు నెలలకు సెకండ్ డోస్ కూడ పూర్తవుతుంది. దీంతో చిత్ర బృందం నిర్భయంగా షూటింగ్ మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నారు. ‘ఆదిపురుష్’ బృందం ఒక్కటే కాదు ఇంకొన్ని రోజుల్లో షూటింగ్ రీస్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్న నిర్మాతలంతా తమ బృందలోని వారికి వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలుపెట్టారు.