మరో సారి “ఆదిపురుష్” నుంచి డిజప్పాయింట్ చేసిన అప్డేట్.!

నేడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా తనకి బర్త్ డే విషెస్ ని తెలుపుతున్నాం.. మరి ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో బిగ్ స్టార్ గా తాను ఎన్నో ఎల్లలు అందుకుంటుండగా ప్రభాస్ నుంచి అయితే ఈరోజు పలు భారీ అప్డేట్స్ ని అందిస్తున్నారు. అయితే ఇపుడు ప్రభాస్ చేసిన సినిమాల్లో అయితే ఆల్రెడీ పూర్తి కాబడిన చిత్రం “ఆదిపురుష్” నుంచి ఫ్యాన్స్ లో ఇప్పుడు కాస్త డౌట్స్ గానే ఉన్నాయి.

హిందీ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తో మళ్ళీ ఫ్యాన్స్ కి అందులోని ఈ బర్త్ డే కి డిజప్పాయింట్ చేశారు. మరి ఈరోజు రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ కూడా టీజర్ లో బొమ్మల మాదిరి గానే కనిపిస్తుంది. కనీసం నాచురల్ గా కూడా ప్రభాస్ ని చూపించలేకపోయారు.

దీనితో ఈ కొత్త పోస్టర్ విషయంలో మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ అంత హ్యాపీ గా అయితే లేరు. ఇక ఈ చిత్రంలో జానకి దేవిగా హీరోయిన్ కృతి శెట్టి నటించగా రావణ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించాడు. అలాగే వరల్డ్ వైడ్ అయితే ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12 3డి లో అందులో ఇంగ్లీష్ లో కూడా విడుదల కానుంది.