Adipurush : ఇన్సైడ్ టాక్ : ఈ మొట్టమొదటి సినిమాగా “ఆదిపురుష్”..ఇదే జరిగితే సంచలనమే..!

Adipurush : ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ స్టార్ ఎవరైనా ఉన్నారు అంటే అది నో డౌట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అనే చెప్పాలి. తన కెరీర్ లో ఒక్కో భారీ సినిమాతో అంచలంచెలుగా ఎదుగుతూ పాన్ ఇండియా స్టార్ స్టేటస్ నుంచి ఇప్పుడు పాన్ వరల్డ్ స్టేటస్ కి వెళ్తున్నాడు. మరి ఇదిలా ఉండగా ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న భారీ సినిమాల్లో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో చేసిన ఇతిహాస చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి.

అయితే ఈ సినిమా షూటింగ్ అంతా కూడా ఆల్రెడీ పూర్తి అయ్యిపోయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ గ్యాప్ లోనే ఈ సినిమా రిలీజ్ పట్ల పలు ఊహించని ఊహాగానాలే వైరల్ అవుతూ బయటకి వచ్చాయి. రిలీజ్ రికార్డు స్థాయి థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అని.. ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ అవ్వనుంది అని టాక్ వినిపించింది.

ఇక ఈ టాక్ లో రెండో మాట ఇంగ్లీష్ రిలీజ్ రిలీజ్ విషయానికి వస్తే ఒక సంచలన వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమా మొట్టమొదటి సారిగా హాలీవుడ్ లో రిలీజ్ అవ్వనుంది అట. మరి ఈ రిలీజ్ నిమిత్తమే ఒక హాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ ఆదిపురుష్ నిర్మాతలతో చర్చలు జరుపుతున్నారని వినికిడి.

మరి ఇందులో ఎంతవరకు నిజముందో కానీ ఇదే నిజం అయితే ఏకంగా ఇండియన్ సినిమా నుంచి ఒక హాలీవుడ్ బ్యానర్ తో రిలీజ్ అయ్యే ఏకైక భారతీయ సినిమాగా ఇది నిలుస్తుంది అని చెప్పలి. మరి ఈ చిత్రంలో కృతి సనన్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు.