“ఆదిపురుష్” టీజర్ 3డి స్క్రీనింగ్ కి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్!!

“ఆదిపురుష్” టీజర్ 3డి మీడియా స్పెషల్ ప్రీమియర్స్ కి మీడియాలో అనూహ్య స్పందన.

రామాయణ ఇతిహాస నేపథ్యంతో ప్రభాస్ హీరోగా ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ టీజర్ ఇటీవల విడుదలై రికార్డులు తిరగరాస్తుండగా, తాజాగా మీడియా కోసం ఏఎంబి థియేటర్లో వేసిన స్పెషల్ షో అందరినీ అబ్బురపరచింది.

ఈ సందర్భంగా హీరో ప్రభాస్ మాట్లాడుతూ, “మొదటిసారి మా టీజర్ ని 3D లో చూస్తూ చిన్నపిల్లాడిలా ఫీల్ అయ్యాను. అభిమానులకోసం 60 థియేటర్లలో 3D టీజర్ వేస్తున్నాం. ఇది థియేటర్ కోసం తీసిన సినిమా. మీ అందరి అభిమానం,
ఆశీస్సులు మాకు కావాలి . రానున్న 10 రోజుల్లో మరింత మంచి కంటెంట్ తో మీ  ముందుకి వస్తున్నాం.” అన్నారు.

దర్శకుడు ఓం ఓం రౌత్ మాట్లాడుతూ, ” 3D లో టీజర్ మీ అందరికి  నచ్చిందనుకుంటున్నాను. దిల్ రాజు గారు ఇక్కడకి వచ్చినందుకు ప్రత్యేక  ధన్యవాదాలు” అన్నారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, ” ఆదిపురుష్ టీజర్ కోసం ఫాన్స్ లాగే నేనూ చాలా ఆతృతగా ఎదురు చుసాను. టీజర్ నాకు చాలా బాగా నచ్చింది ఇదే విషయాన్నీ  మా టీం తో చెప్పా కానీ వాళ్ళు నాతో నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయని  చెప్పారు నేను ఒక్కటే చెప్తున్నాను బాహుబలి సినిమాకి కూడా నెగటివ్
కామెంట్స్ వచ్చాయి కానీ అసలు బొమ్మ చూసాకే దాని రేంజ్ అర్ధమవుతుంది ఆ  తరువాత టాక్ అదే వెళుతుంది.తనాజీ మూవీ చూసేవరకి ఓం రౌత్ ఎవరో కూడా నాకు  తెలీదు కానీ ఆ సినిమా చూసాక అతనికి ఫ్యాన్ అయిపోయాను. ప్రభాస్ ఒక పెద్ద  స్టార్. ఈ సినిమా జనవరి 12 న పెద్ద విజయం సాధిస్తుంది.” అన్నారు.”

నిర్మాత భూషణ్ మాట్లాడుతూ, ” మీ రెస్పాన్స్ కి చాలా ఆనందంగా ఉంది. మీ  అందరికీ టీజర్ నచ్చిందనే అనుకుంటున్నాను. చాలా ఇష్టంతో మీ అందరికీ
నచ్చేలా చిత్రీకరించాం. ప్రభాస్, ఓం రౌత్ చాలా కష్టపడ్డారు. మీ అందరి  ఆశీస్సులు మాకుంటాయని ఆశిస్తున్నాను” అన్నారు.

నిర్మాత రాజేష్ నాయర్ మాట్లాడుతూ, ” జై శ్రీరాం, అదొక్కటే మంత్రం ఇక. ఓం,  ప్రభాస్ ఈ చిత్రాన్ని థియేటర్ల కోసమే చేసారు. భక్తితో చేసిన ఈ చిత్రం మీ  అందరికీ నచ్చుతుందనే ఆశిస్తున్నాం.” అన్నారు.

అయితే ఆధునాతన సాంకేతికత తో 3డి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి రూపొందిన ఈ  చిత్ర టీజర్ ని అభిమానుల కోసం శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో 60-70  థియేటర్లలో ప్రదర్శించనున్నారు .

కృతి సనన్ సీతగా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ రావణుడిగా, సన్నీ  సింగ్ లక్ష్మణుడిగా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో టీ సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు ఈ సినిమాను
నిర్మిస్తుండగా యూవీ క్రియేషన్స్ భాగస్వామ్యంలో వచ్చే ఏడాది జనవరి 12న  ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.