వివాహ బంధంతో ఒక్కటైన ఆది పినిశెట్టి,నిక్కి గల్రాని.. ఫోటో వైరల్!

ఎన్నో తెలుగు, తమిళ సినిమాలలో నటించిన ఆది పినిశెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆది తెలుగులో హీరోగా, విలన్ గా కూడ నటించి ప్రశంశలు అందుకున్నాడు. సరైనోడు, రంగస్థలం, నిన్నుకోరి, యూటర్న్, మలుపు వంటి పలు తెలుగు చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. అయితే ఆది ఇటీవల తను ప్రేమించిన అమ్మాయి నిక్కిగల్రానిని నిశ్చితార్థం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు.

నిక్కి, ఆది వివాహ వేడుక బుదవారం చెన్నైలో చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వివాహ వేడుక కుటుంబసభ్యులు, సన్నిహితుల, సినీ ప్రముఖుల మధ్య ఎంతో ఘనంగా జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ వివాహ వేడుక జరిగింది. మలుపు సినిమాలో కలిసి నటించిన ఆది, నిక్కి ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు. అప్పటినుండి రిలేషన్ లో ఉన్న ఈ ఇద్దరు పెద్దల అంగీకారంతో వివాహబంధంతో ఒక్కటయ్యారు.

ఈనెల 18వ తేదీన చాలా గ్రాండ్ గా జరిగిన వీరి వివాహ వేడుకలో టాలీవుడ్ హీరోలు నాచురల్ స్టార్ నాని, సందీప్ కిషన్ సందడి చేశారు. నిన్ను కోరి సినిమా లో నానితో కలిసి నటించిన ఆది అప్పటినుండి వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆది, నిక్కి వివాహ వేడుకలో మెహిందీ కార్యక్రమంలో ఆలుమా డోలుమా అనే పాటకు ఆది-నిక్కీ లతో కలిసి నాని, సందీప్ కిషన్ డాన్స్ చేశారు . వీరు డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరి వివాహ వేడుకలో ప్రముఖ తమిళ హీరో ఆర్య ఆయన భార్య సయేషా సెహగల్‌ కూడ సందడి చేశారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు కుడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.