Actress Sudha: పని మనిషిగా కూడా పనికి రావు అన్నారు : నటి సుధ

Actress Sudha: తెలుగు సినీ ప్రేక్షకులకు నటి సుధ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాలలో తల్లి, అక్క, వదిన పాత్రలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. ఇకపోతే తెరపై నవ్వుతూ కనిపించే ప్రతి సెలబ్రిటీల వెనక ఎన్నో అవమానాలు, ఏడుపులు ఉంటాయి. అలాంటి వారిలో నటి సుధ కూడా ఒకరు. తాజాగా సుధా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 40 సంవత్సరాలుగా సినిమాలలో తాను ఏడుస్తూనే వున్నాను అని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మేస్త్రి సినిమాలో ఆమెను ఎంపిక చేసిన సమయంలో దాసరి నారాయణరావు గారు లీటర్ గ్లిజరిన్ రాయించారని ఆమె చెప్పుకొచ్చింది.

ఇక ఆ సమయంలో ఆమె ఏడ్చినా, నవ్వినా కూడా కన్నీళ్లు వస్తాయని తెలిపింది. ఇకపోతే నటనకు ప్రభుత్వం నుంచి వచ్చే పురస్కారాలు రాకపోయినా తాను బాధ పడలేదని.. పది మంది కూర్చొని ఇచ్చే అవార్డు కంటే.. లక్షలాది మంది ప్రేక్షకులు ఇచ్చేదే గొప్ప అవార్డు అని సుధ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఆ అవార్డులు వల్ల గర్వం అహంకారం వస్తుంది అని ఆమె తెలిపింది.ఇక తాను నటించిన పాత్రల్లో చాలా గొప్ప పాత్రలు కూడా ఉన్నాయి అని ఆమె చెప్పుకొచ్చింది. బాలచందర్ ఆర్టిస్ట్ ను వాళ్ళ టాలెంట్ ను గుర్తిస్తారని సుధ చెప్పుకొచ్చింది. గ్లామర్ పనిమనిషి క్యారెక్టర్ కు కూడా నీ మొహం సూట్ కాదంటూ బాలచందర్ కామెంట్లు చేశారని సుధా చెప్పుకొచ్చింది.

ఆ తరువాత బాలచందర్ అతను చెప్పిన క్యారెక్టర్ చేస్తే ఇండస్ట్రీలో సక్సెస్ అవుతావని, అలా చేయకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలని బాల చందర్ సూచించారని సుధ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఆమె సెకండ్ సండే కూడా ఖాళీగా ఉండేది కాదని, రోజుకు నాలుగు ఐదు సినిమాల్లో నటించిన రోజులు కూడా ఉన్నాయని ఆమె తెలిపింది. ఇకపోతే నటి సుధ ప్రస్తుతం వరుసగా సినిమా ఆఫర్లను అందుకుంటూ తన కెరీర్ ను కొనసాగిస్తుంది.