నాగచైతన్య తో డేటింగ్ రూమర్స్ పై స్పందించిన నటి శోభిత?

నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత పూర్తిగా తన కెరీర్ పై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న నాగచైతన్య గురించి గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.నాగచైతన్య రెండో పెళ్ళికి సిద్ధమయ్యాడని ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి చెందిన మరొక హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి.గూడచారి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి శోభిత అనంతరం మేనేజర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈమె నటించిన సినిమాల ద్వారా రానీ పాపులారిటీ నాగచైతన్య డేటింగ్ వార్తల ద్వారా బాగా వైరల్ అయ్యారు.

ఈ క్రమంలోనే నాగచైతన్య నటి శోభితతో డేటింగ్ చేస్తున్నారని ఆమె పుట్టినరోజు సందర్భంగా ముంబైలో ఒక రెస్టారెంట్లో తనకు పార్టీ ఇచ్చారని వార్తలు షికార్లు చేశాయి.ఇప్పటికి నాగచైతన్యను తరచూ కలుస్తూ ఉంటారని వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఈ వార్తలపై నటి శోభిత కానీ లేదా నాగ చైతన్య కానీ ఇప్పటివరకు ఏమాత్రం స్పందించక పోవడంతో ఈ వార్తలు నిజమేనని పలువురు భావించారు. ఇలా ఈ వార్తల పై స్పందించకపోయినా నాగచైతన్యకు పెద్దగా నష్టం లేకపోయినా నటి శోభితకు పెద్ద ఎత్తున నష్టం జరిగే ప్రమాదం ఉంది.

ఈ క్రమంలోనే ఈ వార్తలపై పరోక్షంగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఈమె ఒక వీడియోని షేర్ చేస్తూ మిడిల్ ఫింగర్ చూపిస్తూ తన గురించి వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు. ఇలా శోభిత నాగచైతన్య గురించి వస్తున్న వార్తలు పూర్తిగా ఆ వాస్తవమని ఈ వీడియో ద్వారా క్లారిటీ వచ్చింది.ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే ఇప్పటి వరకు ఈ వార్తలపై నాగచైతన్య స్పందించలేదు. ప్రస్తుతం నాగ చైతన్య వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా ఉన్నారు.