Kannappa Actress: మంచు విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రీతి ముకుందన్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. ఇటీవల తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కన్నప్ప సినిమాలో కూడా అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో ఆమె నటనకు గాను మంచి మార్కులే పడ్డాయి. అలా ఈ పాన్ ఇండియా సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది అందాల భామ.
కన్నప్ప సినిమాలో నెమలి పాత్రలో ప్రీతి ముకుందన్ నటించి ఆకట్టుకుంది. ప్రీతి ముకుందన్ టీవీ షోలో నృత్య ప్రదర్శనలలో తన కెరీర్ ను ప్రారంభించింది. మొదటి మ్యూజిక్ ఆల్బమ్ ముత్తు ము2, యూట్యూబ్ లో 4.2 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఆ తర్వాత ఈ చిన్నదానికి సినిమా ఆఫర్స్ వచ్చాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. కన్నప్ప మూవీ సక్సెస్ తో ప్రీతీ క్రేజీ ఆఫర్ అందుకుంది. నివిన్ పౌలీ సినిమాలో ప్రీతీ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందట.
ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో మారింది. అయితే ఈ వార్తల్లో నిజానిజాల గురించి తెలియాలి అంటే ప్రీతి స్పందించే వరకు వేచి చూడాల్సిందే మరి. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఈ ఫోటోలలో తన అందంతో యువతను బాగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..