సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న నటి పూర్ణ.. వరుడు ఎవరంటే?సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న నటి పూర్ణ.. వరుడు ఎవరంటే?సినీనటి పూర్ణ గురించి అందరికీ పరిచయమే. తెలుగులో పలు సినిమాల్లో నటించి తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ అంతగా హీరోయిన్ హోదాను సొంతం చేసుకోలేకపోయింది. ఇక ఆమె బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఢీ షోలో కూడా జడ్జిగా బాధ్యతలు చేపట్టి ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది.
ప్రస్తుతం ఆమె పలు సినిమాల్లో నటించగా.. ఇక త్వరలో ఆమె ఓ ఇంటి కోడలిగా అవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా తన సోషల్ మీడియా ద్వారా ఆ విషయాన్ని తనే షేర్ చేసుకుంది. కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాను అంటూ తన కాబోయే భర్తతో దిగిన ఫోటోలు పంచుకుంది. ఇక అతడి పేరు షానిద్ ఆసిఫ్ ఆలీ. ఇక అతడు బీజేఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండీ అని తెలిసింది.