Pooja Hegde: బుట్ట బొమ్మ స్టెప్ మేమే సృష్టించాము… క్యూట్ వీడియోని షేర్ చేసిన పూజ హెగ్డే!

Pooja Hegde: అల్లు అర్జున్ పూజ హెగ్డే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కి 2020 సంవత్సరంలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా అలా వైకుంఠపురం. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో అల్లు అర్జున్ పూజ హెగ్డే ఎంతో అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలోని ప్రతి ఒక్క పాట ప్రేక్షకుడిని బాగా ఆకట్టుకుందనే చెప్పాలి. ముఖ్యంగా బుట్ట బొమ్మా.. బుట్ట బొమ్మా అనే పాట విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.

ఇప్పటికీ ఈ సినిమాలో పాటలు వినబడితే ప్రతి ఒక్కరూ కాలు కదుపుతారు.ఇకపోతే తాజాగా పూజా హెగ్డే ఈ సినిమాకి సంబంధించిన ఒక వీడియోని ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఈ క్రమంలోని ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సినిమా షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్జున్ పూజ హెగ్డే సరదాగా బుట్ట బొమ్మ పాటకు డాన్స్ చేశారు.

 

అయితే అనుకోకుండా ఈ పాటలో బుట్ట బొమ్మ పాటకు స్టెప్ మేమే క్రియేట్ చేశామని అనుకుంటున్నాము అంటూ రెండు సంవత్సరాల క్రితం తీసిన ఈ క్యూట్ వీడియోను ఈ సందర్భంగా పూజా హెగ్డే ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో అల్లు అర్హతో కలిసి పూజా హెగ్డే బుట్ట బొమ్మ స్టెప్స్ వేస్తూ ఉన్నారు.ఈ సంక్రాంతికి ఈ సినిమా విడుదల అయి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ వీడియోను పూజా హెగ్డే అభిమానులతో పంచుకున్నారు.