Madhavi Latha: మీరు తెలుగు డైరెక్టర్ కదా, మీ సినిమాల్లో తెలుగు అమ్మాయిలని ఎందుకు హీరోయిన్ గా పెట్టారని పూరి జగన్నాథ్ ని, నటి మాధవీ లత అడిగారట. ఎంత మంచి పోకిరి సినిమా తీశారు కదా ఈ సినిమాలో తెలుగు హీరోయిన్ ని ఎందుకు తీసుకోలేదు అని అని ఆమె పూరి జగన్నాథ్ కలిసినప్పుడు అడిగారట. దానికి ఆయన ఏమన్నారంటే నిజం చెప్పాలంటే తాను శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా కోసం ఉమెన్స్ కాలేజ్ చుట్టూ తిరిగానని, అందమైన అమ్మాయి కనిపిస్తే తన సినిమాల్లో హీరోయిన్ గా పెట్టుకుందామని ఆయన అన్నారట. ఫస్ట్ సినిమా కాబట్టి తెలుగు అమ్మాయిలకి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు అని చెప్పి అలా కాలేజీలో చుట్టూ అమ్మాయిల కోసం తిరగానని పూరి జగన్నాథ్ చెప్పారట.
అలా తిరగగా తిరగగా కొందరు అమ్మాయిలు చాలా బాగా అనిపించారు. అలా అని వాళ్ళను సంప్రదిస్తే కొందరేమో తమకు ఇంట్రెస్ట్ లేదని, కొంతమంది తమకు భయమని, కొంతమంది తమ పేరెంట్స్ ని ఒప్పించాలి అని ఆయన చెప్పారట. అప్పటికీ వాళ్ళ తల్లిదండ్రుల్ని సంప్రదించినా కూడా లేదంటే మేము సినిమా ఇండస్ట్రీలోకి మా అమ్మాయిని పంపించము. ఇది మంచి ఇండస్ట్రీ కాదు. ఇన్ని రూల్స్, రెస్ట్రిక్షన్స్ మధ్యలో డైరెక్షన్ చేయాలని ఇంట్రెస్ట్ చచ్చిపోయినప్పుడు ఇక వీళ్ళందరూ అవసరం లేదు. ఎక్కడో మోడలింగ్ లో ఉన్న వాళ్ళని తీసుకుంటామని ఆయన డిసైడ్ అయ్యారట.
ఇకపోతే ఇప్పుడు నా మోడలింగ్ చేసే వారి కోఆర్డినేటర్లును సంప్రదిస్తే అందులో పార్టిసిపేట్ చేసే తెలుగు అమ్మాయిల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని 90 శాతం వరకు కూడా వేరే అమ్మాయిలు ఉంటున్నారని నటి మాధవి లత చెప్పుకొచ్చారు.
ఇదే విషయాన్ని పూరి జగన్నాథ్ గారు కూడా వాళ్ళ ఫోటో చూసి సెలెక్ట్ చేసుకుని వారిని సంప్రదిస్తే సరిపోతుంది. వాళ్ల మదర్ ని ఒప్పించడాలు, ఫాదర్ని అడగడాలు, అలాంటివేమీ ఉండవు అని ఆయన చెప్పినట్టు మాధవీలత తెలిపారు. నిజం చెప్పాలంటే ఆయన చెప్పింది కూడా నిజమే కదా అని తనకు అనిపించినట్లు ఆమె వివరించారు. ఎందుకంటే ఆయన కష్టాలు ఆయనవి. ఒక డైరెక్టర్ గా డైరెక్షన్ చేస్తూ, స్క్రిప్ట్ రాస్తూ, మూవీని డీల్ చేస్తూ, అదీకాక హీరోయిన్ కోసం వాళ్ళ చుట్టూ తిరగడం ఏంటనేది ఒక పాయింట్ అప్పుడు తాను ఆల్బమ్స్ వస్తుంటాయి కదా ఎందుకు వాళ్ళ చుట్టూ తిరగడం అని అడిగినప్పుడు, ఆయన వాళ్లు కూడా నాకు సూట్ కావాలి అవుతారో లేదో చూసుకోవాలి కదా అని అన్నట్టు ఆమె చెప్పారు.
ఇక తన విషయానికొస్తే తనకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు అని అడిగితే దానికి పూరి జగన్నాథ్, మీకు సరిపోయే రోల్ ఇప్పటివరకు రాలేదని ఆయన చెప్పినట్టు మాధవి లత వెల్లడించారు. ఆ తర్వాత ఇంకో సారి కూడా అదే విషయం ఆయనని అడిగితే తనకు సూటబుల్ అయ్యే రోజులు వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను అని ఆయన అన్నట్టు ఆమె తెలిపారు. ఇక ఆయనను తాను అడగకూడదని నిశ్చయించుకున్నట్లు మాధవీలత తెలిపారు. అంతే కాకుండా తనకు అడగడం కూడా ఇష్టం లేదని ఆమె చెప్పారు.