తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాడు వ్యాప్తంగా రాజకీయ వాతావరణం నెలకొన్నది. ఈ నేపథ్యంలో తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తాకింది.
కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి కుష్బూ తన పదవికి రాజీనామా చేశారు. పార్టీకి కూడా రాజీనామా చేసిన కుష్బూ.. బీజేపీలో చేరబోతున్నారని సమాచారం.
సోమవారం మధ్యాహ్నం కుష్బూ.. బీజేపీలో చేరుతారని తెలుస్తోంది. అయితే.. ఖుష్బూ గత కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా లేరు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరికొత్త విద్యా విధానాన్ని ఖుష్బూ స్వాగతించడం.. తమిళనాడులో పెద్ద వివాదం లేపింది. ఆ మద్దతు తెలపడాన్ని కాంగ్రెస్ నాయకులు విభేదించారు. కాంగ్రెస్ నేత రాహుల్ కూడా ఈ విషయంపై ట్వీట్ చేశారు. అయితే.. ఖుష్బూ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. బీజేపీ కొత్త విద్యా విధానాన్ని మెచ్చుకుంటూనే ఉన్నారు.
అయితే.. ఎన్నికల వేళ ఆమె ఈ నిర్ణయం తీసుకుంటుందని ఎవ్వరూ ఊహించలేదు. సడెన్ గా ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు.