Heroin Childhood Photo: ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కుర్రకారు మనసులను కొల్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా!

Heroin Childhood Photo: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏం నడుస్తుంది అంటే త్రో బ్యాక్ ఫోటోల హవా నడుస్తోందని చెప్పవచ్చు.సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత అభిమానులకు సెలబ్రిటీలకు మధ్య దూరం చాలా వరకు తగ్గిపోయింది.ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులు వారి అభిమాన హీరో హీరోయిన్లతో నేరుగా సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్నారు అలాగే వారికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది సెలబ్రిటీలు వారి చిన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వారి అభిమానులు పెద్ద ఎత్తున ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఒకప్పుడు దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటిస్తూ.. అందరి చేత ఔరా అనిపించుకున్న ఆ ముద్దుగుమ్మ చిన్నప్పటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిన్నప్పుడు ఎంతో క్యూట్ గా ఉన్నటువంటి ఈ బ్యూటీ హీరోయిన్ గా కూడా అదే క్యూట్ నెస్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. మరి ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా? ఒకప్పుడు ఈమెకు వరుస అవకాశాలు వచ్చినప్పటికీ ప్రస్తుతం ఏమి ఎలాంటి అవకాశాలు లేకుండా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.

ఎప్పటికీ ఈమె ఎవరో గుర్తు రాలేదా? అదేనండి మన గోవా బ్యూటీ ఇలియానా. ఇలియానా చిన్నప్పటి ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. ప్రస్తుతం ఇలియానాకు సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు తన చిన్ననాటి అందం గురించి పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.ఇక ప్రస్తుతం ఈమెకు ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటోలను ఇలా త్రో బ్యాక్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.