Hema: మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో జరిగిన సంఘటనల ఆధారంగా తాను కరాటే కల్యాణీ-నరేష్‌ల మీద కేసు పెట్టానని నటి హేమ చెప్పారు. ఆ తర్వాత తనకు బ్లాక్ మెయిల్ కాల్స్ కూడా వచ్చాయని ఆమె చెప్పుకొచ్చారు. ఆ విషయం ప్రకాశ్ రాజ్ గారికి కూడా చెప్పానని ఆమె అన్నారు. తన దగ్గర ఐఫోన్ ఉందని, దాంట్లో రికార్డింగ్ ఆప్షన్ లేదని, అందుకే రికార్డు చేయలేకపోయానని ఆమె చెప్పారు.
ఇక వివరాల్లోకి వెళితే, అర్థరాత్రి 12 గంటలకు తనకు ఒక ఫోన్ కాల్ వచ్చిందని, ఏంటే కంప్లైంట్ ఇస్తున్నావ్, చంపేస్తాం అనే వాయిస్ వచ్చిందని ఆమె చెప్పారు. అది విని తాను గట్టిగా అరిచానని హేమ తెలిపారు. అంతే కాకుండా అది తాను విని అరిచేలోపల, అర్థం చేసుకునే వాళ్లు ఆ వ్యక్తి కాల్ కట్ చేశారని ఆమె అన్నారు. నిజానికి వాడు తనని బెదిరించడానికి ఫోన్ చేశాడని, కానీ తన వాయిస్ విని భయపడి వాడే పెట్టేశాడని ఆమె నవ్వుతూ చెప్పారు.
ఆ సమయంలో తనతో పాటు అక్కడ తన కూతురు, తన భర్త కూడా ఉన్నారని, ఆ ఎలక్షన్ల గురించే మాట్లాడుకుంటున్నారని ఆమె చెప్పారు. రేపు పొద్దున ఏం జరుగుతుందో ఏంటో అని వారు ఆలోచిస్తూ ఉన్న సీరియస్ సిచ్యువేషన్‌లో ఇలా ఫోన్ చేశారని, తాను అరవడంతో వాళ్లు ఫోన్ కట్ చేశారని ఆమె తెలిపారు. అది విని తన భర్త ఏమైందని అడిగారని, తాను మాత్రం ఏం లేదని చెప్పినట్టు హేమ చెప్పారు. ఎందుకంటే అప్పటికీ ఏం జరుగుతుందో ఏంటో అన్న టెన్షన్, భయంలో వాళ్లు ఉన్నారని ఆమె చెప్పుకొచ్చారు. అలాంటి సమయంలో ఇలా ఎవరో కాల్ చేసి బెదిరిస్తున్నాడని చెప్తే, వాళ్లు తట్టుకోలేరని ఆమె స్పష్టం చేశారు. వాళ్లింట్లో తానొక్కతే చాలా ధైర్యవంతురాలన్న హేమ, ఎలాంటి సందర్భాన్నైనా ఫేస్ చేస్తానన్న నమ్మకం తనకుందని ఆమె చెప్పారు. మళ్లీ ఫోన్ వస్తుందేమోనని ఆ రాత్రంతా తన ఫోన్‌ను సైలెంట్‌లో పెట్టానని, కానీ ఆ తర్వాత మళ్లీ ఎలాంటి కాల్ రాలేదని ఆమె వివరించారు.