Naga Chaitanya: ఇటీవల విడుదలైన బంగార్రాజు సినిమాలో తాను నటించడం తనకు చాలా ఆనందంగా ఉందని నటి దీక్షా నాగర్కర్ అన్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య ఇంట్రడక్షన్ సాంగ్ ద్వారా తాను ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నానని ఆమె చెప్పుకొచ్చారు. ఆ పాటలో అక్కినేని నాగార్జున ఉండరని, కేవలం చిన్న బంగార్రాజుగా చేసిన చై మాత్రమే కనిపిస్తారని ఆమె చెప్పారు.
ఇకపోతే నాగ చైతన్యతో కలిసి పనిచేయడం తనకు చాలా ఆనందంగా అనిపించిందని దీక్షా చెప్పారు. ఆయన చాలా స్వీట్ మరియు చాలా హంబుల్‌గా ఉంటారని ఆమె తెలిపారు. ఇప్పటి వరకు ఆయన చాలా సినిమాలు చేశారు. ఎంతో మంది అగ్ర కథానాయికలు, మరియు డైరెక్టర్స్‌తో కూడా కలిసి పనిచేశారు. కానీ ఆయన మాత్రం అలా కనిపించరని, చాలా నిజాయతీగా నడుచుకుంటారని, ఆయనలో ఆ గర్వం గానీ ఎక్కడా కనిపించవని నాగచైతన్య గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దీక్ష.
ఇక నాగ చైతన్య నుంచి తాను నేర్చుకున్నదేమిటంటే ఆయనిస్తున్న ప్రతి ఒక్క షాట్ కూడా అది తాను ఫస్ట్ టైం ఇస్తున్నట్టే అనిపిస్తుందని ఆమె అన్నారు. అందరూ అంటారు చై చాలా కామ్ ఇంకా ఎవేవో అని, కానీ షాట్ దగ్గరికొచ్చే సరికి వందశాతం ఎనర్జీని పెట్టి చేస్తారని ఆమె ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన్ని చూసి తాను ఆ ఎనర్జీని ఎలా ఉపయోగించుకోవాలి అనేది నేర్చుకున్నానని ఆమె అన్నారు. నిజంగా నాగ చైతన్య మంచి యాక్టర్ అని కూడా దీక్ష నొక్కి చెప్పారు. కానీ తాను మాత్రం నాగ చైతన్యలా కాకుండా చాలా టేక్‌లు తీసుకున్నానని, ఎందుకంటే ఫస్ట్ టైం నటిస్తున్నా కాబట్టి కొంచెం నెర్వస్‌గా అనిపించిందని ఆమె తెలిపారు.