Bhagyashree: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రభాస్ తో ఎవరూ కలిసి పనిచేసిన అతని గురించి గొప్పగా చెబుతూ ఉంటారు. ప్రభాస్ ఎంత పెద్ద హీరోయిన్ అప్పటికీ షూటింగ్ సెట్ లో చూడటానికి చాలా సింపుల్ గా ఉంటారని, అందరినీ ఆప్యాయంగా పలకరిస్తారు అని, ఒకరిని సమానంగా గౌరవిస్తారు అని చెబుతూ ఉంటారు. తాజాగా ప్రభాస్ ఫై బాలీవుడ్ నటి భాగ్యశ్రీ కూడా ప్రశంసల వర్షం కురిపించింది.
నటి భాగ్యశ్రీ ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ తల్లి పాత్రలో నటించింది. ఈనెల 11న ఈ సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ ప్రభాస్ గురించి విన్నాను, అతను ఇంతకు ముందు ఎక్కడా చూడలేదు.. కానీ సెట్ లో ఆయనను చూసి ఎలా పలకరించాలి అనుకుంటుండగానే ప్రభాస్ నా దగ్గరికి వచ్చి మీ అభిమానిని అని చెప్పడంతో నేను షాక్ అయ్యాను అని తెలిపింది నటి భాగ్యశ్రీ. అంతేకాకుండా అంత సింపుల్ గా ఉంటారని, చాలా చనువుగా మాట్లాడుతాడు అని నేను ఊహించలేదు అని చెప్పుకొచ్చింది.